టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఓ తెలుగు న్యూస్ చానెల్ లో జరిగిన చర్చ సందర్భంగా హీరో రాజశేఖర్, నటి జీవితలపై సామాజిక కార్యకర్త సంధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ అమ్మాయిల పిచ్చోడని - ఆయన భార్య జీవితే...స్వయంగా అమీర్ పేట హాస్టళ్ల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి రాజశేఖర్ దగ్గరకు పంపుతుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై జీవితా రాజశేఖర్ నేడు ప్రెస్ మీట్ నిర్వహించి స్పందించారు. ఈ సందర్భంగా తనపై రాజశేఖర్ పై వచ్చిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఏ ఆధారాలతో వారు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు? నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోనని, ఆ వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నానని సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ ....తమపై వ్యాఖ్యలు చేసిన వారికి కొన్ని ప్రశ్నలను సంధించారు.
కొద్ది రోజులుగా టీవీల్లో క్యాస్టింగ్ కౌచ్ పై జరుగుతున్న చర్చల్లో పాల్గొనమని తనను పిలిచారని, కానీ, ఆ చర్చలు చాలా అసహ్యంగా - చీప్ గా ఉన్నాయనిపించి తాను వెళ్లలేదని చెప్పారు. ఓ చర్చ సందర్భంగా సంధ్య - ఆ చానెల్ ఎడిటర్ ....తాను రాజశేఖర్ దగ్గరకు అమ్మాయిలను పంపిస్తున్నానని వాళ్లకు వాళ్లే తేల్చేసి ప్రకటించేసుకున్నారని మండిపడ్డారు. మహిళా హక్కుల కోసం పోరాడే సంధ్య సాటి ఆడదానిపై ఇటువంటి నిరాధార ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. తమపై వేసిన ఆ ఆరోపణలను వారు రుజువు చేయాల్సిందేనని జీవిత అన్నారు.
గతంలో కూడా సినిమావాళ్లపై సంధ్య ఇటువంటి వ్యాఖ్యలు చేశారని, సినిమా వాళ్లంటే ఆమెకు చులకనని జీవిత చెప్పారు. తమను చూస్తే తమాషాగా ఉందా? అని జీవిత ప్రశ్నించారు. వారిపై కోర్టుకి వెళ్ల బోతున్నానని, పరువు నష్టం దావా వేయబోతున్నానని సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఇష్టమొచ్చినట్లు టీవీల్లో డిబేట్లు పెట్టి సినిమావాళ్లు, సెలబ్రిటీల గురించి మాట్లాడితే ఊరుకోనని జీవిత అన్నారు. అడిగేవారు ఎవ్వరూ లేరని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరని, చేతులకి గాజులుతొడుక్కుని కూర్చోలేదని హెచ్చరించారు.
రాజశేఖర్ ఏ పార్టీలో పబ్ లో కనిపించారు? అమ్మాయిలతో తిరుగుతూ ఎక్కడ కనిపించారని జీవిత ప్రశ్నించారు. మా నలుగురు కుటుంబ సభ్యులు తప్ప వేరెవరితోనైనా ఏదన్నా ఫంక్షన్ కు వెళ్లడం చూశారా ? అని ప్రశ్నించారు. రాజశేఖర్ కు వ్యతిరేకంగా ఆధారాలు లేకుండానే లైవ్ డిబేట్లలో అటువంటి వ్యాఖ్యలు చేస్తారా? అసలు ఎవరికి ఏం కావాలని ఈ మొత్తం చర్చ జరుగుతోందని జీవిత ప్రశ్నించారు. శ్రీరెడ్డికి టీవీల్లో అంతగా ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు? అని జీవిత అన్నారు. తాను నిర్మాతనని, దర్శకత్వం కూడా చేశానని,సినిమాలో పాత్రలు ఎలా ఇస్తారో వాళ్లకు తెలుసా అని ప్రశ్నించారు? ఓ సినిమా తీయాలంటే ఎంత ఖర్చవుతుందో....ఎంతగా కష్టపడాలో వారికి తెలుసా అని ప్రశ్నించారు. ఒకవేళ సినిమా ఆడకపోతే ఆస్తులు అమ్మి అప్పులు తీర్చాల్సిన పరిస్థితుల గురించి తెలుసా అని ప్రశ్నించారు. ఒకవేళ సినిమాకి నష్టం వస్తే ఎవరు భరిస్తారు? ఏ పాత్రకు ఎవరు సరిపోతారు...అని ప్రొడ్యూసర్లు - దర్శకులు ఎంత ఆలోచిస్తారో వారికి తెలీదా అని మండిపడ్డారు. నటించగలిగిన వారికి తప్పకుండా అవకాశాలు వస్తాయని జీవిత అన్నారు. టీవీల్లో, సోషల్ మీడియాలో - యూట్యూబ్ లో వస్తోన్న వార్తలను చూసి ఎవరో చెప్పింది విని అదంతా నిజమని నమ్మొద్దని జీవిత విజ్ఞప్తి చేశారు. టాలీవుడ్ లో అవకాశాలు ఇచ్చే క్రమంలో మోసాలు జరుతుగున్న మాట వాస్తవమేనని, అన్ని చోట్లా ఈ తరహా మోసాలున్నాయని - అలాగే సినీ పరిశ్రమలో కూడా ఉన్నాయని చెప్పారు. ఇండస్ట్రీలో ఏ మహిళకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు అందినా దానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటూనే ఉన్నామని అన్నారు.