యాంగ్రీ హీరో రాజశేఖర్ నటించిన `కల్కి` ఇటీవల రిలీజైన సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి ఈ సినిమాపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజశేఖర్- జీవిత దంపతులు తెలుగు సినీమీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జీవిత నొచ్చుకోవడం మీడియా వర్గాల్లో చర్చకొచ్చింది. `కల్కి` దర్శకత్వ బాధ్యతల్లో జోక్యం చేసుకున్నారట కదా? అని ఓ జర్నలిస్టు సంధించిన ప్రశ్నకు అంతే ఘాటైన సమాధానం ఇచ్చారు జీవిత.
``20 కోట్లు పెట్టి సినిమా నిర్మించే వారికి ఆమాత్రం బాధ్యత ఉండదా? తెరకెక్కించే విధానం నచ్చాలా.. వద్దా? ముందు మాలో పది మందికీ నచ్చకుండా కోట్లాది మందికి నచ్చుతుందా? నేనేమీ తెలీని దానినా? పరిశ్రమలో 30 ఏళ్ల అనుభవం ఉంది. నేను తీసిన సినిమాలు ఆడినా ఆడకపోయినా నాకు దర్శకత్వంపై పట్టు ఉంది. నా అనుభవంతో తప్పులు జరగకుండా జాగ్రత్తపడతాను`` అని ఖరాకండిగా చెప్పారు. దీంతో ఎట్టకేలకు దర్శకత్వ శాఖలో ప్రశాంత్ వర్మకు తాను సాయపడ్డానని జీవిత అంగీకరించినట్టయ్యింది.
``సినిమా నాదైనప్పుడు నేను దాని గురించి ఎందుకు పట్టించుకోను?`` ఇలాంటి ప్రశ్నలెందుకు అడుగుతారు? అంటూ జీవిత కాస్తంత ధుమధుమలాడారు. `దర్శకత్వ పరంగా జాగ్రత్తలేవైనా తీసుకున్నారా? లేదా సలహాలిచ్చారా? అని మాత్రమే ప్రశ్నించాలని తనదైన శైలిలో విలేకరికి క్లాస్ తీస్కున్నారు. నేనేమన్నా సలహాలిచ్చి ఉంటే అవేంటో అడిగి తెలుసుకోకుండా `ఎందుకు జోక్యం చేసుకున్నారు?` అని ప్రశ్నించకూడదని సీరియస్ అయ్యారు. ``బాధ కలిగించింది.. అందుకే ఇలా అడుగుతున్నా.. గొడవ పడేందుకు కాదు!!`` అని జీవిత అనడం కొసమెరుపు. ఈ ఇంటర్వ్యూలో రాజశేఖర్ ఎంతో జోవియల్ గా మాట్లాడుతూ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నామని తెలిపారు.