స్టార్ కూతురి డెబ్యుకి ఎన్ని కష్టాలో

Update: 2019-05-03 08:48 GMT
మొదలుపెట్టిన టైం బాగున్నట్టు లేదు . రాజశేఖర్ పెద్ద కూతురు శివాని డెబ్యు మూవీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోవడం తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో క్లారిటీ లేకపోవడం ఆ ఫ్యామిలీని బాగా ఇబ్బంది పెడుతోంది. ఒకపక్క చెల్లి శివాత్మిక మొదటి సినిమా దొరసాని టైటిల్ లోగో రిలీజ్ అయిపోయింది. ఇటు చూస్తే శివాని అడవి శేష్ జంటగా హింది సూపర్ హిట్ మూవీ 2 స్టేట్స్ కి రీమేక్ గా మొదలుపెట్టిన ఈ మూవీ ఆదిలోనే హంసపాదు ఎదురుకుంటోంది.

వెంకట్ అనే డెబ్యు దర్శకుడు తీసిన వెర్షన్ సంతృప్తికరంగా రాని కారణంగా అడవి శేష్ కు అతనికి మధ్య ఏదో విభేదాలు వచ్చాయన్న తరహలో చాలా పుకార్లు వచ్చాయి కాని దాని గురించి టీం మెంబెర్స్ ఎవరు ఇప్పటిదాకా స్పందించలేదు. తాజా అప్ డేట్ ప్రకారం ఇది వచ్చే ఏడాదిలో తప్ప రిలీజయ్యే ఛాన్స్ లేదు. దాదాపు ఇప్పటిదాకా తీసింది రీ షూట్ చేస్తేనే బెటర్ అని అడవి శేష్ సలహా ఇవ్వడంతో జీవిత ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం.

ఎలాగూ దర్శకత్వ అనుభవం ఉంది కాబట్టి తనే టేకప్ చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో ఆలోచనలు జరుగుతున్నట్టు సమాచారం. అడవి శేష్ మరోపక్క మేజర్ షూటింగ్ తో పాటు గూడచారి సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నాడు. సో ఏది డిసైడ్ చేసినా జీవితే డిసైడ్ చేయాలి. ఇది తేలి తిరిగి షూటింగ్ మొదలుపెట్టి అంతా ఒక క్రమపద్ధతిలోకి వచ్చే లోపు ఎంత లేదన్నా ఏడాది టైం పడుతుంది. సో అక్క కన్నా చాలా ముందుగా చెల్లి సినిమానే వచ్చేస్తుంది. 2 స్టేట్స్ రీమేక్ కి దర్శకుడు మారతారో లేక జీవితనే మైక్ అందుకుంటారో వేచి చూడాలి
    

Tags:    

Similar News