స‌త్య‌దేవ్ కోసం జెనీఫ‌ర్ పిచినెటో వ‌చ్చేసింది!

Update: 2022-11-19 15:57 GMT
విభిన్న‌మైన సినిమాల‌తో వెర్స‌టైల్ హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా, విల‌న్‌గా త‌న‌దైన మార్కు సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్న హీరో స‌త్య‌దేవ్‌. `గాడ్సే` త‌రువాత మూడు క్రేజీ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా వున్నాడు. మిల్కీ బ్యూటీ త‌మన్నాతో `గుర్తుందా సీతాకాలం`, స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ స‌మర్ప‌ణ‌లో రూపొందుతున్న `కృష్ణ‌మ్మ‌`, ఫుల్ బాటిల్ లో న‌టిస్తున్నాడు. ఈ మూడు సినిమాలు త్వ‌ర‌లో రిలీజ్ కి రెడీ కాబోతున్నాయి.

ఇదిలా వుంటే క‌న్న‌డ న‌టుడు, `పుష్ప‌`లో జాలిరెడ్డిగా న‌టించిన డాలీ ధ‌నంజ‌య‌తో క‌లిసి స‌త్య‌దేవ్ ఓ భారీ సినిమా చేస్తున్నాడు. ఓల్డ్ టౌన్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో ప్రొడ‌క్ష‌న్ నం.1 గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ మూవీకి ఈశ్వ‌ర్ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. రీసెంట్ గా మొద‌లైన ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. హీరో స‌త్య‌దేవ్, డాలీ ధ‌నంజ‌య ల‌కు ఇది 26వ సినిమా. ఈ మూవీని బాల సుంద‌రం, దినేష్ సుంద‌రం నిర్మిస్తున్నారు.

క్రిమిన‌ల్ యాక్ష‌న్ క్రైమ్ డ్రామాగా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో స‌త్య‌దేవ్, డాలీ ధ‌నంజ‌య హీరోలుగా న‌టిస్తున్నారు. ఈ ఇద్ద‌రికి జోడీగా ఇద్ద‌రు హీరోయిన్ ల‌ని ఫైన‌ల్ చేశారు. అయితే ముందు త‌మిళ న‌టి ప్రియా భ‌వానీ శంక‌ర్ ని ఫైన‌ల్ చేయ‌గా.. తాజాగా మ‌రో హీరోయిన్ ని ఎంపిక చేశారు. మ‌రో హీరోయిన్ పాత్ర‌లో జెనీఫ‌ర్ పిచినెటో ని ఎంపిక చేశారు.

ఈ విష‌యాన్ని శ‌నివారం చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ బ్రెజిల్ సుంద‌రి ఇప్ప‌టికే ప‌లు తెలుగు వెబ్ సిరీస్ ల‌లో న‌టించింది. తిరువీర్ తో క‌లిసి ఆహా ఓటీటీ కోసం `సిన్` అనే పేరుతో రూపొందిన వెబ్ డ్రామాలో న‌టించింది. ఇదే ఆమె తెలుగు సినిమా. శ‌నివారం అనౌన్స్ చేసిన పోస్ట‌ర్ లో జెనీఫ‌ర్ అల్ట్రా మోడ్ర‌న్ లుక్ లో క‌నిపిస్తూ ఆక‌ట్టుకుంటోంది.

ఇక ఇందులో స‌త్య‌రాజ్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. సినిమాకు ఆయ‌న పాత్ర అత్యంత కీల‌కంగా వుంటుంద‌ని మేక‌ర్స్ అంటున్నారు. చ‌ర‌ణ్ రాజ్ సంగీతం, మ‌ణికంఠ‌న్ కృష్ణ‌మాచారి ఛాయాగ్ర‌హ‌ణం, మీరాఖ్ డైలాగ్స్, అనిల్ క్రిష్ ఎడిటింగ్ అందిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News