న్యాచురల్ స్టార్ నానికి ఈ ఏడాది అచ్చిబాటు రాలేదు. కృష్ణార్జున యుద్ధం డిజాస్టర్ కాగా దేవదాస్ ఇద్దరు హీరోలు ఉన్నా యావరేజ్ అనిపించుకోవడానికే నానా తిప్పలు పడింది. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇంకా దగ్గరవుదామని ట్రై చేసిన బిగ్ బాస్ 2 యాంకరింగ్ మిశ్రమ అనుభూతులు మిగిల్చింది. మూడో సిరీస్ కోసం అడిగినా నో చెప్పేసాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని చేస్తున్న జెర్సీ షూటింగ్ హడావిడి లేకుండా జరుగుతోంది.
90ల నేపథ్యంలో క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ కోసం నాని అదే పనిగా క్రికెట్ ప్రాక్టీస్ చేసాడు. దీన్ని రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 19న జెర్సీ విడుదల కానుంది. ఆ మేరకు అధికారిక పోస్టర్ కూడా విడుదలైంది. నాని ఫాన్స్ ఇంకా ఆరు నెలలు వెయిట్ చేయాలి. నానికి జెర్సీ సక్సెస్ చాలా కీలకం. ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. తమిళ్ లో డిమాండ్ పీక్స్ లో ఉన్న సంగీత దర్శకుడు అనిరుద్ దీనికి ట్యూన్స్ ఇవ్వడం ప్రధాన ఆకర్షణ. అజ్ఞాతవాసి నిరాశపరిచినప్పటికీ అనిరుద్ రెండు పాటలకు మంచి పేరు వచ్చింది. దీనికి బెస్ట్ ఇస్తానని సోషల్ మీడియాలో అనిరుద్ ప్రత్యేకం గా ప్రస్తావించాడు.
నాని కూడా గెటప్ ను మార్చుకున్నాడు. కాస్త జుట్టు ఎక్కువగా పెంచి రఫ్ లుక్ వచ్చేలా గెడ్డం కూడా హై లైట్ చేస్తున్నాడు. మూడు దశల్లో క్రికెటర్ జీవితాన్ని ఇందులో చూపించబోతున్నారని ఇన్ సైడ్ టాక్. తెలుగులో స్పోర్ట్స్ డ్రామా అందులో క్రికెట్ మీద గత కొన్నేళ్లలో ఏ స్టార్ హీరో సినిమా రాలేదు. ఇవన్నీ జెర్సీకి ప్లస్ అవుతున్నాయి. ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఫ్యాన్స్ లోనే కాదు నానిలో కూడా చాలా గట్టిగా ఉందీసారి