యూట్యూబ్ ఛానెల్స్ లో క్లిక్ బెయిట్స్ గురించి అందరికీ తెలిసిందే. లోపల కంటెంట్ ఒకటుంటే బైట టైటిల్ మరోటి ఉంటుంది. టైటిల్ చూస్తే ఎలాంటివారైనా దాన్ని క్లిక్ చేయకుండా ఉండలేరు. ఈ పోకడపై ఇప్పటికే ఎన్నో విమర్శలున్నా ఈ టైటిల్స్ ట్రెండ్ మాత్రం ఆగడం లేదు. చాలామంది సెలబ్రిటీలు ఈ స్పైసీ.. మిస్ లీడింగ్ టైటిల్స్ బారిన పడినవాళ్ళే.
రీసెంట్ గా పాపులర్ యాంకర్ ఝాన్సి ఒక వెబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఇంటర్వ్యూయర్ అలాంటి టాపిక్ గురించి అడిగాడు. "మీకు ఈమధ్య ఒక కాస్ట్యూమ్ డిజైనర్ తో ఏదో ఇష్యూ వచ్చిందని అంటున్నారు.. దాని గురించి చెప్పండి" అని అడిగాడు. ఈ ప్రశ్నకు చిరాకు పడిన ఝాన్సి అసలేమైందో తెలుసుకోవాలని ఎవరికీ లేదని.. ఒక వెబ్ ఛానల్ వారు ఎక్కువ క్లిక్స్ కోసం మిస్ లీడింగ్ థంబ్ నెయిల్ క్రియేట్ చేసి పెట్టడంతో అందరూ దాన్నే చూశారని.. కాని తను ఇంటర్వ్యూ లో ఏం క్లారిటీ ఇచ్చిందో మొత్తం ఎవరూ వినడం లేదని చెప్పింది. ఇప్పుడు మీరు కూడా ఆ థంబ్ నెయిల్ చూసే అలాంటి ప్రశ్న అడిగి ఉంటారని కాస్త గట్టిగానే చెప్పింది.
చిత్రమైన విషయం ఏంటంటే ఈ రిపోర్టర్ చేసిన ఇంటర్వ్యూ కు కూడా టైటిల్ 'ఇంటర్వ్యూయర్ పై ఫైర్ అయిన ఝాన్సి' టైపులో పెట్టారట. దీనర్థం ఏంటంటే.. సెలబ్రిటీలు ఏం మాట్లాడినా వాటిని ట్విస్ట్ చేసి మిస్లీడింగ్ థంబ్ నెయిల్స్ పెడతారన్నమాట.
Full View