తమిళ్ - తెలుగు అలాగే బాలీవుడ్.. ఇలా మూడు ప్రధానమైన ఒక్కో ఇండస్ట్రీలో శ్రీదేవి 70 సినిమాలకు పైగా చేసింది. మళయాలం కన్నడ లో కూడా ఆమె సుపరిచితమే. అయితే శ్రీదేవి మొదట్లో నటిగా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుందో తుది శ్వాస వరకు కూడా అదే తరహాలో మంచి పేరును సంపాదించింది. ఎన్నో అవార్డులను అందుకుంది. అయితే ఎంతో ప్రతిష్టాత్మకమైన నేషనల్ అవార్డును మాత్రం ఆమె చూడకుండానే వెళ్లిపోయారు.
ఆమె తరపు నుంచి కుటుంబ సభ్యులు భావోద్వేగంతో అవార్డును ఈ రోజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింథ్ చేతుల మీదుగా అందుకున్నారు. మామ్ చిత్రానికి గాను శ్రీదేవికి ఆ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఒక సవితికి పుట్టిన కూతురిని ప్రమాదకరమైన పరిస్థితి నుంచి మహిళ ఎలా కాపాడింది అనేది మామ్ అసలు కథ. సినిమాలో శ్రీదేవి నటన ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే జాన్వీ కపూర్ అవార్డు ప్రధానోత్సవంలో శ్రీదేవి చీరను కట్టుకొని వచ్చింది.
రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డును జాన్వీ - ఖుషి అలాగే శ్రీదేవి భర్త బోణి కపూర్ అందుకున్నారు. ఈ వేడుకలో కపూర్ ఫ్యామిలీ ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. ఈ సమయంలో శ్రీదేవి ఉంటే ఎంతో సంతోషించేదని బోణి కపూర్ కంటతడి పెడుతూ మామ్ సినిమా చిత్ర విశేషాలను తెలిపారు. దర్శకుడు రవి సినిమాను అద్భుతంగా తెరకెక్కించడానికి శ్రీదేవి కెరీర్ కు మామ్ సినిమా ఒక మంచి అనుభూతిని ఇచ్చిందని బోణి కపూర్ తెలిపారు.