ఒకనాటి అందాల తార శ్రీదేవి ఇప్పుడు తన కూతురిని హీరోయిన్ చేసేస్తున్న సంగతి తెలిసిందే. మరాఠీ మూవీ సైరత్ ను హిందీలో రీమేక్ చేస్తుండగా.. ఈ సినిమాలో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్ కి జోడీగా జాన్వి కపూర్ నటిస్తోంది. ధడక్ షూటింగ్ ప్రారంభానికి ముందే టెస్ట్ షూట్ చేసిన కొన్ని పిక్స్ ను విడుదల చేసి.. ఆసక్తి కలిగించారు మూవీ యూనిట్.
ఇప్పుడు జాన్వి మరుసటి చిత్రం కూడా ఖాయం అయిపోయినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన తెలుగు మూవీ టెంపర్ ను హిందీలో శింబా అంటూ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రణవీర్ సింగ్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో.. జాన్వి కపూర్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. తెలుగులో కాజల్ అగర్వాల్ పోషించిన పాత్రను హిందీలో జాన్వి చేయనుంది. అయితే.. టెంపర్ తో పోల్చితే శింబాలో హీరోయిన్ రోల్ డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక్కడ పాటలకు.. రెండు కామెడీ సీన్లు.. రెండు సెంటిమెంట్ సీన్లకే పరిమితం అయిన హీరోయిన్ క్యారెక్టర్ ను.. హిందీలో మరింతగా డెవలప్ చేస్తారని అంటున్నారు.
ఈ మేరకు ఇప్పటికే దర్శకుడు రోహిత్ శెట్టి నుంచి బోనీకపూర్- శ్రీదేవిలకు ప్రామిస్ లభించిందట. అందుకే టెంపర్ రీమేక్ లో జాన్వి ని నటింపచేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అలా శ్రీదేవి కూతురి ఖాతాలోకి టెంపర్ రీమేక్ వచ్చింది. మొదటి సినిమా కోసం పెర్ఫామెన్స్ పాత్రను ఎంచుకున్న జాన్వి.. రెండో చిత్రంతోనే కమర్షియల్ రూట్లోకి వచ్చేసి.. అమ్మ అడుగు జాడలను అచ్చంగా ఫాలో అయిపోతోంది.