లాక్మే ఫ్యాష‌న్‌ వీక్‌ లో జాన్వీ గ్లింప్స్‌

Update: 2018-08-25 11:50 GMT
జాన్వీ క‌పూర్ .. వ‌న్ ఫిలింవండ‌ర్ ఇప్ప‌టివ‌ర‌కూ. కానీ మునుముందు బాలీవుడ్‌ ని సంచ‌ల‌నాల‌తో ఓ ఆటాడుకోబోతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. జాన్వీ లైన‌ప్‌ని డాడ్ బోనీక‌పూర్ ఓ రేంజులో ప్లాన్ చేస్తున్నార‌ని మొన్న‌టి త‌ఖ్త్ ప్ర‌క‌ట‌న త‌ర్వాత అర్థ‌మైంది. ఇండ‌స్ట్రీ దిగ్గ‌జాలంతా జాన్వీ ఖాతాలో ఉన్నారు. క‌ర‌ణ్‌ జోహార్ - భ‌న్సాలీ - భ‌ట్స్‌ - య‌శ్‌ రాజ్‌ లు .. ఇలా ఎవ‌రితో అయినా స‌త్సంబంధాలు నెరిపే ధీర‌త్వం ది గ్రేట్ బోనీ ప్ర‌త్యేక‌త‌. అంద‌రితోనూ అత‌డు న‌డిపించే లావాదేవీలు - స్నేహ‌సంబంధాలు జాన్వీని పై స్థాయికి తీసుకెళ‌తాయ‌న‌డంలో సందేహం లేదు.

క‌ర‌ణ్ జోహార్ తెర‌కెక్కిస్తున్న పీరియాడిక‌ల్ ఎపిక్ సినిమా త‌ఖ్త్‌లో క‌చ్ఛితంగా జాన్వీ పాత్ర కుర్ర‌కారును మైమ‌రిపించే విధంగా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఇదిగో తాజాగా ముంబై ఫ్యాష‌న్ వీక్‌ లో జాన్వీ మెరిసిన తీరు చూస్తుంటే ప‌ద్మావ‌తికి చెల్లెలువా?  లేక ముంతాజ్‌కి వేలువిడిచిన మేన‌కోడ‌లివా ? అని అడిగేయాల‌నిపిస్తోంది. ఆ ప‌రికిణీలో జాన్వీ క‌నిపిస్తున్న తీరు అంతందంగా ఉంది. అంద‌మైన పూల‌వానాన్ని అంతే అందంగా డిజైన్ చేసిన డిజైన‌ర్ వేర్‌ లో జాన్వీ బుట్ట‌బొమ్మ‌నే త‌ల‌పిస్తోంది.

అందానికి అందం.. ఏ డిజైన‌ర్‌ వేర్‌ కి అయినా సూట‌య్యే త‌న దేహ‌శిరులు - తీర్చిదిద్దిన యాబ్స్ .. ఆ దివ్య‌రూపం కుర్రాళ్ల క‌ళ్ల‌లో అలానే ఉండిపోతుందేమో అన్నంత బ్యూటిఫుల్‌ గా క‌నిపిస్తోంది. ధ‌డ‌క్ విజ‌యం ఇచ్చిన గ్లింప్స్ ని ఇలా ఫ్యాష‌న్ షోల్లోనూ ర్యాంప్‌ వాక్‌ ల‌తో చూపిస్తోంది జానూ!! మేరా జాన్‌!!
Tags:    

Similar News