ఆ పెళ్లిలో వీళ్ళదే హడావుడి!!

Update: 2018-05-08 06:15 GMT
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్.. వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడే రోజు ఇవాళే. ముంబైలో గ్రాండ్ గా జరుగుతున్న ఈ పెళ్లికి సంబంధించి అప్ డేట్స్ ఎక్కువగానే ఉన్నా.. వేడుకలకు సంబంధించిన పిక్స్ మాత్రం తక్కువగానే సర్క్యులేట్ అవుతున్నాయి.

సోనమ్ పెళ్లి వేడుకలలో శ్రీదేవి కూతుళ్లు ఇద్దరూ మెరిసిపోతున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. సోనమ్ వీరికి వరుసకు అక్క అవుతుందనే సంగతి తెలిసిందే. జాన్వి కపూర్.. ఖుషీ కపూర్ ల తండ్రి బోనీ కపూర్ కు తమ్ముడు అనిల్ కపూర్. ఈయన కూతురే సోనమ్ కపూర్. అంటే బాబాయ్ కూతురి పెళ్లి అన్న మాట. అక్క పెళ్లి కావడంతో.. ఈ ఇద్దరి హంగామా మామూలుగా లేదు.

రెండు నెలల క్రితమే శ్రీదేవి హఠాన్మరణం నుంచి వీలైనంత త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తున్న జాన్వి కపూర్.. ఖుషీ కపూర్.. అక్క పెళ్లి వేడుకలలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతీ సందర్భంలోను ఇద్దరూ సందడి చేస్తున్నారు. అయితే.. సోనమ్ పెళ్లి వేడుకలలో పెదనాన్న బోనీ కపూర్ మాత్రం భాగం కావడం లేదు. పెళ్లికి అటెండ్ అవుతున్నారు కానీ.. ఆయన ఇంకా తన భార్య శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన సంఘటన నుంచి బయటకు రాలేదని సన్నిహితులు అంటున్నారు..........
Tags:    

Similar News