స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నిన్న రాత్రి ముంబైలోని ఒక స్టార్ హోటల్ వద్ద సాంప్రదాయ పంజాబీ కశ్మీరీ స్టైల్స్ లో తన ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో ఊహించని ఓ విచిత్రం తెలుగు వారిలో ఆసక్తికర చర్చకు తావిచ్చింది.
ఆసక్తికరంగా ఈ వెడ్డింగ్ లో వధువు వరుడు తలపై ‘జీలకర్ర బెల్లం’ అనే తెలుగు వివాహ సాంప్రదాయాన్ని ఆచరించారు. తెలుగు లోగిళ్లలో తెలుగింటి అమ్మాయిగా పాపులరైనందుకు కృతజ్ఞతగా కాజల్ ఇలా హత్తుకునే నివాళి అర్పించారు.
కాజల్ ఇన్ స్టాగ్రామ్ లో పెళ్లి ఫోటోని షేర్ చేశారు. ఇది వారి వివాహ సమయంలో `జీలకర్ర బెల్లం` కర్మను ఆచరిస్తున్న ఫోటో. ఈ కర్మకు సంబంధించిన ప్రాముఖ్యతను ఆమె తన ఉత్తర భారత అభిమానులకు వివరించారు. ``గౌతమ్ దక్షిణ భారతదేశంతో నా వ్యక్తిగత సంబంధాలకు నివాళి`` అని కాజల్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. చందమామ కాజల్ ఇప్పటికే తెలుగు నేలపై పుట్టిన బిడ్డలకు స్వచ్ఛంద సేవలు చేస్తున్నారు.