రాక రాక ఇప్పుడే రావాలా కాజల్

Update: 2015-07-22 11:37 GMT
కాజల్ టైం ఇప్పుడు అస్సలు బాలేదు. ఈ ఏడాది టెంపర్ లంటి పెద్ద హిట్టు కొట్టినా.. ఆ హిట్ తాలూకు క్రెడిట్లో ఆమెకు కొంచెం కూడా దక్కలేదు. తెలుగులో అవకాశాలే లేకపోవడంతో ఇక్కడ జెండా ఎత్తేసి కోలీవుడ్ లో సెటిలైంది. ఐతే అక్కడ కూడా ‘మారి’ సినిమా దెబ్బ కొట్టేసింది. దీంతో అమ్మడు డీలా పడిపోయింది. ఇలాంటి టైంలో కాజల్ తమిళ హిట్ మూవీ ‘జిల్లా’ను తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇందులో హీరో విజయ్ అయినా.. తెలుగు ఆడియన్స్ ను ఆకర్షించాల్సిన బాధ్యత కాజల్ దే. అందుకే ప్రోమోస్ లో ఆమెనే బాగా హైలైట్ చేస్తున్నారు. విడుదల కోసం చాన్నాళ్ల పాటు ఎదురు చూసి ఈ నెల 24కు రిలీజ్ ఫిక్స్ చేశారు.

ఐతే కాజల్ హవా సాగించే అవకాశాలు పెద్దగా కనిపించట్లేదు. బాక్సాఫీస్ దగ్గర బాహుబలి జోరు ఇంకా కొనసాగుతోంది. పైగా అల్లరి నరేష్ సినిమా ‘జేమ్స్ బాండ్’ విడుదలవుతోంది. బాహుబలి ఉండగా తమ సినిమాను చూస్తారా అని ‘జేమ్స్ బాండ్’ యూనిట్ కే కొంచెం సందేహాలున్నాయి. అలాంటిది తమిళ డబ్బింగ్ మూవీ ‘జిల్లా’ను జనాలు ఎక్కడ చూడాలి? మామూలుగా తమిళ సినిమాలంటే వైవిధ్యంగా ఉంటాయన్న పేరుంది. అక్కడి నుంచి రొటీన్ సినిమాలొస్తే మనోళ్లు పట్టించుకోరు. జిల్లా అలాంటి భిన్నమైన సినిమా ఏం కాదు. మన దగ్గర వచ్చే మసాలా టైపే. కాబట్టి ‘జిల్లా’ ఏమాత్రం ప్రభావం చూపిస్తుందో చూడాలి.
Tags:    

Similar News