కరోనా వైరస్(కోవిడ్-19) కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. స్కూల్స్ కాలేజీలకు శెలవులు ప్రకటించారు. థియేటర్లు మూసివేస్తున్నారు. షాపింగ్ మాల్స్ కూడా మూతపడుతున్నాయి. అంతెందుకు కోవిడ్ కారణంగా ఎంతో కొంత ప్రభావం కనిపించని రంగం ఒక్కటి అంటే ఒక్కటి కూడా కనిపించడం లేదు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా పనులు మానుకుని తమ ఇంట్లోనే ఉంటున్నారు. సినిమా సెలబ్రిటీలే కాదు అంతర్జాతీయ క్రికెటర్లు కూడా ప్రస్తుతం ఇంట్లోనే సమయం గడుపుతున్నారు. అన్ని దేశాల క్రికెట్ బోర్డులు సిరీసులను వాయిదా వేయడంతో క్రికెటర్లు ఇంటిపట్టునే ఉంటున్నారు.
శ్రీలంక పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ టీమ్ కూడా వెనక్కు వచ్చేసింది. దీంతో ఇతర టీం సభ్యుల తరహాలోనే ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ కూడా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే జేమ్స్ సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్. శెలవుల్లో తను ఏం చేస్తున్నాడనేది రెండు వీడియోలు పోస్ట్ చేసి మరీ అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోలో తన కుమార్తెలను వెయిట్ లిఫ్టింగ్ చేసినట్టు ఎత్తుతూ ఎక్సర్ సైజ్ చెయ్యడం విశేషం. ఒక వీడియోలో ఒక కూతురితోనూ.. మరో వీడియోలో మరో కూతురితోనూ ఇలా ఎక్సర్ సైజ్ చేశాడు. ఈ వీడియోలకు "నేను ఇంట్లో ఉండి కసరత్తులు చేసేందుకు మా అమ్మాయిలు చాలా సంతోషంగా సహాయం చేస్తున్నారు" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

ఈ వీడియోకు సోషల్ మీడియాలో భారీ స్పందన దక్కింది. శెలవుల్లో ఇలా కసరత్తులు చేయడం కొత్త విషయం అని.. ఒకవైపు పిల్లలతో సరదాగా గడుపుతూనే ఇలా ఫిట్నెస్ పై దృష్టి కూడా పెట్టడం భలేగా ఉందని చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రొఫెషన్ విషయానికి వస్తే జేమ్స్ ఖాతాలో పలు రికార్డులు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 150 టెస్టులు ఆడి తొలి బౌలర్ జేమ్స్ ఆండర్సన్ కావడం విశేషం.