`జోగి` ట్రైల‌ర్ : 1984 సిక్కుల ఊచ‌కోత నేప‌థ్యంలో..!

Update: 2022-08-30 11:51 GMT
అది ఊహ‌కు అంద‌ని మార‌ణ‌హోమం.. మూడు రోజుల్లో మూడు వేల మంది సిక్కులను ఊచకోత కోశారు. స‌రిగ్గా 33 సంవత్సరాల క్రితం దిల్లీ వీధుల్లో దారుణ మార‌ణకాండ ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం అయ్యింది.  1984 అక్టోబర్ 31న భారత ప్రధాని ఇందిరా గాంధీని ఆమె బాడీగార్డులు కాల్చి చంపారు. ఈ వార్త దావానంలా వ్యాపించింది. ఇందిరను చంపిన బాడీగార్డులు సిక్కులని తెలియడంతో ప్రతీకారంగా దిల్లీలోని సిక్కులపై దాడులు ప్రారంభమయ్యాయి. వారి ఆస్తులను త‌గుల‌బెట్టారు. ఇండ్ల‌ను మంట‌ల‌కు అర్ప‌ణం చేశారు. మూడు రోజుల పాటు విధ్వంశ కాండ‌ను కొన‌సాగించారు. ఇందులో ఎంద‌రో అమాయ‌కులు చ‌నిపోయారు. 3000 మందిని ఘోరంగా చంపారు. వేలాదిగా సిక్కులు నిరాశ్రయులయ్యారు.

స‌రిగ్గా మూడు ద‌శాబ్ధాల త‌ర్వాత హిస్ట‌రీలో నిక్షిప్తం చేయ‌బ‌డిన ఈ ఘ‌ట్టాన్ని ఎంపిక చేసుకుని వెబ్ సిరీస్ ని రూపొందిస్తుండ‌డం దేశ‌వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వెబ్ సిరీస్ క‌ల్చ‌ర్ లో ఇలాంటి హిస్టారిక‌ల్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాల‌ను ప్ర‌జ‌లు తిరిగి బుల్లితెర‌లు ఓటీటీల‌లో వీక్షించే అవ‌కాశం ల‌భించ‌డం నిజంగా ఒక అదృష్టం అని చెప్పాలి.

1984 సిక్కుల ఊచ‌కోత నేప‌థ్యంలో.. ఎమోష‌న‌ల్ హ‌త్యాకాండ ఎలా సాగింది? అన్న‌దానిని నెట్ ఫ్లిక్స్ లో సిరీస్ గా విడుద‌ల చేయ‌నున్నారు. నెట్‌ఫ్లిక్స్ చిత్రం `జోగి`లో దిల్జిత్ దోసాంజ్ ప్ర‌ధాన పాత్ర‌ల న‌టించారు. కుముద్ మిశ్రా- మొహమ్మద్ జీషన్ అయ్యూబ్- అమైరా దస్తూర్ -హితేన్ తేజ్వానీ కూడా నటించారు. ఈ చిత్రం 2022 సెప్టెంబర్ 16 న విడుదల అవుతుంది. ఈ చిత్రం 1984 నాటి దిల్లీ అల్లర్ల సమయంలో త‌మ‌ను తాము కాపాడుకుంటూ త‌మ కుటుంబాల‌ను ర‌క్షించుకుంటూ జీవించడానికి ప్రయత్నించే ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. ట్రైల‌ర్ ఆద్యంతం ఎంతో ఉత్కంఠ‌గా ఉద్విగ్నంగా ఆక‌ట్టుకుంది. దిల్జీత్ దోసాంజ్ ఎంతో ఛాలెంజింగ్ పాత్ర‌లో న‌టించార‌ని అర్థ‌మ‌వుతోంది. నాటి బొంబాయి మ‌త ఘ‌ర్ష‌ణ‌లు..అల్ల‌ర్ల నేప‌థ్యంలో బొంబాయి లాంటి చారిత్రాత్మ‌క చిత్రాన్ని తెర‌కెక్కించారు మ‌ణిర‌త్నం. అదే త‌ర‌హాలో జోగి క‌ట్టిప‌డేస్తుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

నెట్ ఫ్లిక్స్ `జోగి` ట్రైలర్ ను షేర్ చేస్తూ నెట్ ఫ్లిక్స్ అధికారిక ఇన్ స్టాగ్రామ్ పేజీ లో వివ‌రాలు వెల్ల‌డించారు “జింకే హౌస్లే బులంద్ హో.. ఉంకీ హిమ్మత్ తోడ్నా నముమ్‌కిన్ హోతా హై. ఐసా హీ హై సద్దా జోగీ. @దిల్జీత్ దోసాంజ్ జోగిని చూడండి .. స్నేహం, .. ధైర్యం  ఆశ గురించిన కథ. సెప్టెంబర్ 16న నెట్ ఫ్లిక్స్ లో మాత్రమే!” అని వెల్ల‌డించారు.

ట్రైలర్ లో ‘ఎప్పటికైనా అతిపెద్ద హ్యూమన్ హీస్ట్’ సినిమా అంటూ హైలైట్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. జోగి కుటుంబంతో కలిసి అల్పాహారం తీసుకోవడంతో వీడియో మొదలవుతుంది.. ఢిల్లీలో జరిగిన అల్లర్లను ఆవిష్క‌రించారు. జోగి అతని కుటుంబం ఢిల్లీ నుండి తప్పించుకుని పంజాబ్ కు వెళ్లడానికి ప్రయత్నిస్తారు.. ఎందుకంటే ఇది వారికి సురక్షితమైన ప్రదేశం. జోగి తన ఇద్దరు స్నేహితులతో కలిసి వారి ప్రణాళికను అమలు చేస్తాడు.. అల్లర్ల మధ్య బ్రతకడానికి ప్రయత్నిస్తాడు.

నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని త‌న సిక్కు అంగరక్షకులు హత్య చేయడం 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు ప్ర‌ధాన కార‌ణం. ఇది దేశవ్యాప్తంగా వేలాది మంది సిక్కుల దారుణ మరణాలకు దారితీసింది.. ముఖ్యంగా న్యూఢిల్లీలో సిక్కులు అత్య‌ధికంగా ఊచ‌కోత‌కు గుర‌య్యారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Full View
Tags:    

Similar News