‘జనతా గ్యారేజ్’లో మరో మలయాళ విలన్

Update: 2016-04-13 11:30 GMT
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘జనతా గ్యారేజ్’ ఇప్పటికే కాంబినేషన్ పరంగా విపరీతమైన ఆసక్తి రేపుతోంది. మోహన్ లాల్ ను ఇందులో ముఖ్య పాత్రకు ఎంపిక చేసుకోవడంతోనే ఒక రకమైన హైప్ వచ్చింది. సమంతతో పాటు నిత్యా మీనన్ ను కూడా ఎన్టీఆర్ కు జోడీగా ఎంచుకోవడంతో ఆసక్తి రెట్టింపైంది. మలయాళ సినీ పరిశ్రమకే చెందిన ముకుందన్ ను విలన్ గా తీసుకోవడం కూడా జనాల దృష్టిని ఆకర్షించింది.

ఇప్పుడు తాజాగా ఈ సినిమాలోకి మరో మలయాళ విలన్ వచ్చాడు. అతనే జాన్ కొక్కెన్. ఈ పేరు మనకు పెద్దగా పరిచయం లేదు కానీ.. ఈ నటుడు ఆల్రెడీ తెలుగు సినిమాల్లో నటించాడు. ‘ఎవడు’తో పాటు ఇంకొన్ని సినిమాల్లో చిన్న స్థాయి విలన్ పాత్రలు పోషించాడు. ఐతే ‘జనతా గ్యారేజ్’లో మాత్రం జాన్ కొక్కెన్ కు చెప్పుకోదగ్గ పాత్రే ఇచ్చాడట కొరటాల. ఈ పాత్ర తన కెరీర్ ను మలుపు తిప్పుతుందని జాన్ ఆశిస్తున్నాడు.

రెండు నెలల కిందట మొదలైన ‘జనతా గ్యారేజ్’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. జూన్ నెల కల్లా షూటింగ్ పూర్తి చేసేయాలన్న ప్రణాళికతో ఉన్నాడు కొరటాల. ఎన్టీఆర్ గత సినిమా ‘నాన్నకు ప్రేమతో’ మంచి ఫలితాన్నందుకోవడం.. కొరటాల శివ వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడంతో ‘జనతా గ్యారేజ్’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా మంచి బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని ఏరియాల్లో బిజినెస్ కూడా అయిపోయింది. ఆగస్టు 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Tags:    

Similar News