యావత్ తమిళనాడు అంతా ఈ శుక్రవారం విడుదలయ్యే ''కబాలి'' ఫీవర్ లో మునిగిపోయింది. అందరూ ఇప్పుడు ''కబాలి'' ఎప్పుడు తెరమీద 'కబాలి డా' అంటాడో అని ఎదురుచూస్తున్నారు. జూలై 22న విడుదలవుతున్న ఈ సినిమా క్రేజ్ గురించి మన ప్రత్యేకంగా చెప్పేదేముంది. అయితే ఇప్పుడు చిన్న చిన్న పోలీస్ స్టేషన్లలో కబాలి సినిమాపై కేసులు పెట్టడానికి రెడీ అవుతున్నారు తెలుసా?
నిజానికి కేవలం చెన్నయ్ నగరంలోనే షుమారు 350 షోస్ వేస్తున్నారు. కాని 95% ధియేటర్ల దగ్గర అప్పుడే తొలివారం టిక్కెట్లు లేవు అంటూ బోర్డులు తిప్పేశారు. హౌస్ ఫుల్ బోర్డును చూస్తుంటే అభిమానుల గుండె తరుక్కుపోతోందట. అయితే.. ఎవరన్నా మంత్రి - ఎమ్మెల్యే - ఎంపి మొదలగు రాజకీయ నాయకులకు మాత్రం టిక్కెట్లు దొరుకుతున్నాయట. అదే విధంగా ఐఏఎస్ లు ఐపిఎస్ లు కూడా టిక్కెట్లు సంపాదిస్తున్నారట. అలాంటి పెద్దలకు ఇస్తున్నారు కాని మాకు ఇవ్వట్లేదంటూ అభిమానులు కొందరు కేసులు పెట్టడానికి సన్నద్దమైతే.. మాకు మాత్రం దొరికాయేంటీ అంటూ పోలీసులు కూడా నిట్టూర్చి.. సర్దిచెప్పి పంపిస్తున్నారని టాక్.
ఏదేమైనా సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజే వేరండి. ఆ వయస్సులో కూడా అసలు ఆయనకు ఉన్న ఫాలోయింగ్ చూస్తుంటే మతిపోవాలంతే. ఇక తెలుగు రాష్ట్రంలలో ఇంకా టిక్కెట్ కౌంటర్లను ఓపెన్ చేసినట్లు లేరు మరి.