జోనితా గాంధీ... మొన్నటి వరకు ఈ పేరు పెద్దగా పరిచయం లేదు. కానీ ఎప్పుడైతే ఈ అమ్మడు విజయ్.. పూజా హెగ్డే నటించిన బీస్ట్ సినిమాలోని అరబిక్ కుత్తు పాటను పాడిందో అప్పటి నుండి జాతీయ స్థాయిలో గుర్తింపును దక్కించుకుంది. ఈ అమ్మడికి అందమైన గాత్రం మాత్రమే కాకుండా అందమైన రూపం కూడా ఉంది. చూడగానే హీరోయిన్ రేంజ్ అందం అనిపిస్తుంది.
ఈమె కేవలం సింగర్ గా పరిమితం అవ్వకుండా హీరోయిన్ గా నటించాలని చాలా మంది కోరుకున్నారు. అన్నట్లుగానే.. చాలా మంది కోరుకున్న విధంగా జోనితా గాంధీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. కొత్త జంట నయనతార మరియు విఘ్నేష్ శివన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న 'వాకింగ్ టాకింగ్ స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్' అనే సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది.
ఈమె హీరోయిన్ గా నటిస్తున్న సదరు సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ అందమైన సింగర్ ను పికు గా వాకింగ్ టాకింగ్ స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్ సినిమా లో కనిపించబోతుంది. అందమైన జోనితా మరింత అందంగా ఈ పోస్టర్ లో కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
వినాయక్ వి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు అర్జున్ చాందీ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంలో క్రిష్ కుమార్.. రియా సుమన్.. వైష్ణవ్ అందాలే.. రేచల్ డేవిడ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యిందని త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. సింగర్ గా హిట్ సాధించిన జోనితా హీరోయిన్ గా సక్సెస్ అయ్యేనా చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.