తెలుగు నాట `బిగ్ బాస్ -3` ఎన్నో వివాదాల నడుమ ప్రారంభోత్సవానికి రెడీ అవుతోంది. ఈ షో నిర్వాహకులపై జర్నలిస్ట్ కం యాంకర్ శ్వేతారెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. షో నిర్వాహకులు తప్పుడు కాంట్రాక్ట్ తీసుకుని వేధింపులకు పాల్పడ్డారని.. ఎంపిక చేశాక కూడా చివరి నిమిషంలో తనను అనర్హురాలిని చేశారని ఆరోపించారు. తాజాగా మరోసారి శ్వేతారెడ్డి ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రకరకాల విషయాలు ప్రస్థావిస్తూ నటి హేమపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
``ఆమె లాగా బిగ్ బాస్ షోకి వెళ్ళాలనే కక్కుర్తి నాకు లేదు. కమిట్ మెంట్లు.. అగ్రిమెంట్లు మీకు పరిపాటి అయ్యుండొచ్చు`` అని హేమను ఉద్ధేశించి శ్వేతారెడ్డి వ్యాఖ్యానించారు. నటి హేమ ఈసారి హౌస్ లోకి ఎంటరవుతున్నారన్న వార్తల నడుమ తనపై ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రియాలిటీ షో హోస్టింగ్ కి రెడీ అవుతున్న నాగార్జున గురించి ప్రస్థావిస్తూ .. నేను అక్కినేని నాగార్జున గారికి అభిమానిని అని తనకు మహిళాభిమానులు ఎక్కువేనని తెలిపారు. అయితే అక్కినేని ఫ్యామిలీ నుంచి క్యాష్ కమిటీలో మెంబర్ గా ఉన్న సుప్రియ కూడా ఇంతవరకూ తనకు జరిగిన అన్యాయంపై స్పందించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు.
నాకు జరిగిన అన్యాయంపై జాతీయ మీడియా అండ లభించింది. స్టార్ గ్రూప్ స్పందించి అంతర్గత విచారణ జరిపిస్తోంది. ఫిర్యాదు చేసినా పోలీసులే ఇంకా చర్యలు తీసుకోలేదు. మరోవైపు క్వాష్ పిటీషన్ వేశాం. కోర్టులో విచారణ సాగుతోంది.. అని శ్వేతారెడ్డి తెలిపారు.