మొదటి రోజు తాగొచ్చిన లేడి డైరక్టర్

Update: 2016-10-28 07:30 GMT
బాలీవుడ్ జోయా అక్తర్ ఉంది చూడండి.. ఈమె తీసే సినిమాలు బీభత్సాతి భీభత్సమైన కలక్షన్లను వసూలు చేయకపోయినా కూడా.. ఎందుకో హార్ట్ టచింగ్ గా ఉంటాయ్. అయితే తొలిసారిగా 'లక్ బై ఛాన్స్' సినిమాతో డైరక్టర్ గా మారిన జోయా.. ఆ తరువాత జందగీ నా మిలేగి దొబారా.. దిల్ దడ్కనే దో.. వంటి సినిమాలను తీసింది. ఈ సందర్భంగా ఆమె ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిందండోయ్.

తొలిసారిగా లక్ బై ఛాన్స్ సినిమాను డైరక్ట్ చేస్తున్నప్పుడు.. ఔట్ డోర్ షూటింగ్ ఉన్నప్పుడు.. బయట ఎక్కడైనా షూట్ చేయాలని జోయాకు చేయి కాలూ ఆడేది కాదంట. అమ్మడు వెంటనే గడగడా వణికిపోయేదంట. ఆ ఫియర్ ను పోగొట్టుకోవడానికి పొద్దున్నే సెట్ కు తాగేసి వచ్చేదట. అలా మధ్యం కారణంగా అమ్మడికి హ్యాపీగా భయపడకుండా షూట్ చేయడం అలవాటు అయిపోయిందట. ఏంటి? తాగేసి సినిమాలు తీసిందా? అవును. అలాగే తీసింది. కాని ఇరగదీసింది.

అయితే ఈ మధ్యకాలంఓ జోయా అక్తర్ తాగకుండా సినిమాలను తీస్తోంది. అందుకు కారణంగా.. ఆమె పూర్తిగా ఖాళీ జనసాంద్రతలేని లొకేషన్లను ఎంచుకోవడమే. మొత్తానికి రచ్చ లేపుతోంది కదూ.

నోట్: మద్యపానం ఆరోగ్యానికి హానికరం!!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News