పన్ను ఎగవేత కింద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక - కేంద్ర ఆర్థిక శాఖ నోటీసులకు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చాలా వేగంగా స్పందించారు. *నాన్నకు ప్రేమతో* చిత్రంలో హీరోగా నటించిన ఎన్టీఆర్.. అందుకు గానూ రూ7.33 కోట్ల పారితోషికాన్ని అందుకున్నారు. ఈ మొత్తానికి సంబంధించి ప్రభుత్వానికి ఆయన 1. 10 కోట్ల మేర పన్ను కట్టాల్సి ఉంది. ఇదే అంశాన్ని ప్రస్తావించిన కాగ్ నివేదిక... జూనియర్ ఎన్టీఆర్ పన్ను ఎగవేసినట్లుగా తేల్చేసింది. కాగ్ నివేదిక ఆధారంగా కేంద్ర ఆర్థిక శాఖ ఎన్టీఆర్ కు నోటీసులు జారీ చేసింది.
అయితే ఈ నోటీసులపై ఏ ఒక్కరూ ఊహించని విధంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. *నాన్నకు ప్రేమతో* చిత్రంలో నటించినందుకు గానూ తాను రూ.7.33 కోట్లను పారితోషికంగా తీసుకున్న మాట వాస్తవమేనని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ మొత్తానికి సంబంధించి తాను పన్ను కట్టాల్సిన అవసరమేమీ లేదని కూడా ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. *నాన్నకు ప్రేమతో* చిత్రం షూటింగ్ పూర్తిగా లండన్ లో జరిగిందని, విదేశాల్లో జరిగిన సదరు చిత్రానికి సంబంధించి తనకు అందిన పారితోషికానికి పన్ను వర్తించదని ఎన్టీఆర్ వివరణ ఇచ్చారు.
ఎన్టీఆర్ ఇచ్చిన వివరణ ఇలా ఉంది. *నాన్నకు ప్రేమతో చిత్రం లండన్ లో నిర్మించిన చిత్రం. లండన్ లో చిత్రీకరించిన సినిమాకు భారత్ లో ట్యాక్స్ వర్తించదు. కాగ్ నోటీసులకు మా ఆడిటర్ సమాధానం ఇచ్చారు. ఆదాయపన్ను - సర్వీస్ ట్యాక్స్ క్రమం తప్పకుండా చెల్లిస్తున్నా. భారత పౌరుడిగా చట్టపరమైన బాధ్యతలను ఎప్పుడూ మరువలేదు. పన్ను ఎదైనా ఉంటే అణా పైసలతో సహా చెల్లించేందుకు రెడీగా ఉన్నాను* అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఈ వివాదంపై సవివరంగా సమాధానం ఇచ్చారు. మరి ఈ వివరణపై కేంద్రం గానీ, కాగ్ గానీ ఏమంటుందో చూడాలి. మొత్తానికి తనపై వచ్చిన ఆరోపణలు, తనకు జారీ అయిన నోటీసులపై ఏమాత్రం బేషజాలకు పోకుండా ఎన్టీఆర్ స్పందించిన తీరు ఆకట్టుకునేలా ఉందనే చెప్పాలి.