గ్యారేజ్ లోకి ఎంట్రీ ఇచ్చేశాడు

Update: 2016-03-05 08:20 GMT
నాన్నకు ప్రేమతో తర్వాత సూపర్ జోష్ లో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. తొలిసారిగా యాభై కోట్ల కలెక్షన్ సాధించిన ఊపు ఎన్టీఆర్ లో కనిపిస్తోంది. మరోవైపు దర్శకుడు కొరటాల శివ కూడా రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఊపులోనే ఉన్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ తో సినిమా సెట్ అవగానే అంచనాలు పెరిగిపోయాయి. జనతా గ్యారేజ్ అనే వర్కింగ్ టైటిల్ పై కొన్ని వారాల క్రితమే ఈ మూవీ షూటింగ్ మొదలైంది.

ఈ సినిమాలో కీలక నటుడైన మోహన్ లాల్ తో పాటు మరికొందరిపై పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే, ఇప్పటివరకూ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం షూటింగ్ లో పాల్గొనలేదు. ఇప్పుడా ముహూర్తం వచ్చేసింది. మార్చ్ 5 నుంచి, అంటే ఇవాల్టి నుంచే జనతా గ్యారేజ్ యూనిట్ తో జతవుతున్నాడు ఎన్టీఆర్. యంగ్ టైగర్ పై ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు, కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లోనే నిర్మించనున్నారు. మరొ నెల రోజులకు పైగా.. సారధి స్టూడియోస్ లో వేసిన గ్యారేజ్ సెట్ లోనే  ఈ మూవీ షూటింగ్ జరగనుంది.

సినిమాకి కీలకం అయిన సన్నివేశాలు ఈ గ్యారేజ్ చుట్టూనే తిరుగుతాయి. అందుకే భారీగా వేసిన ఈ సెట్ లోనే ఎక్కువ భాగం షూట్ జరగనుంది. ఇక్కడ తీయాల్సిన సన్నివేశాలు అయిపోయాకే.. ఇతర లొకేషన్స్ కి వెళ్లాలని నిర్ణయించారట. సమంత, నిత్యా మీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న జనతా గ్యారేజ్ కు.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Tags:    

Similar News