సినీ తారలు సర్జరీలు చేసుకోవడం చాలా కామన్. అందంగా కనిపించాలని వారి ఆకృతిని మార్చుకుంటారు. ఆ విధంగా చాలా మంది స్టార్స్ పలు రకాల సర్జరీలను వారి శరీరంపై ప్రయోగించారు. హీరోయిన్స్ తో పాటు హీరోలు కూడా స్పెషల్ గా ఆ దారిలో నడిచారు. ఇక లావుగా ఉంటే లైపోసక్షన్ చేసుకొని సన్నబడటం కొందరి తారలకు అలవాటే. టాలీవుడ్ లో ఆ విధమైన ప్రయోగం చేసి బాడీని అందంగా మార్చుకున్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు.
అప్పట్లో తారక్ ఎంత బొద్దుగా లావుగా ఉండేవాడో అందరికి తెలిసిందే. అయితే యమదొంగ కోసం తారక్ లైపోసక్షన్ చేసుకొని సన్నబడ్డాడు. ఆ సినిమాలో ఎన్టీఆర్ లుక్ అందరికి నచ్చేసింది. స్టార్ దర్శకులు చాలా మంది ఆ తరువాత తారక్ ని వారికీ ఇష్టం వచ్చినట్లు మార్చుకున్నారు. అయితే ఈ మధ్య జై లవకుశ సినిమాలో మళ్లీ నందమూరి హీరో కొంచెం లావైనట్లు కనిపించాడు. దీంతో నెక్స్ట్ సినిమా కోసం మళ్లీ లైపోసక్షన్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తారక్ నెక్స్ట్ త్రివిక్రమ్ తో చేయబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా కోసం దర్శకుడు కొత్త లుక్ లో కనిపించాలని సూచించడంతో తారక్ లైపోసక్షన్ చేసుకోవడం వల్ల అజ్ఞాతంలో ఉన్నట్లు రూమర్స్ ఓ రేంజ్ లో వస్తున్నాయి. అయితే అసలు విషయంలోకి వెళితే తారక్ ఫ్రెండ్స్ తో హ్యాపీగా క్రికెట్ ఆడుతూ స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నాడట. ఈ విషయం తారక్ సన్నిహితుల ద్వారా తెలిసింది. లైపోసక్షన్ చేసుకున్నాడనే వార్త పూర్తి అవాస్తవమని ఆయన మేనేజర్ కూడా కొట్టిపారేశారు.