ప్రస్తుతం ఇండియన్ సినిమాలో బయోపిక్స్ హవా నడుస్తోంది. మరి జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎవరి బయోపిక్ చేయాలనుకుంటాడు.. అతడి మనసులో ఇలాంటి ఆలోచన ఏదైనా ఉందా..? ఈ ప్రశ్నలే అతడి ముందు ఉంచితే ఆసక్తికర సమాధానం చెప్పాడు. ‘‘బయోపిక్స్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నాకు బాగా ఇష్టమైన వ్యక్తి తాతగారు. నాకు చాలా చాలా స్ఫూర్తినిచ్చారు. చేస్తే ఆయన పాత్రే చేయాలి. కానీ చేయను. ఇప్పుడే కాదు. పదేళ్ల తర్వాత నన్నీ ప్రశ్న అడిగినా ఇదే సమాధానం చెబుతాను’’ అని తేల్చి చెప్పాడు ఎన్టీఆర్. తన తాత పాత్ర పోషించడానికి తన స్థాయి ఎప్పటికీ సరిపోదన్నది ఎన్టీఆర్ ఉద్దేశం.
ఇక చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాల గురించి ప్రస్తావిస్తే.. ‘‘అలాంటివి చేయాలని ఉంది. కానీ లోపల ఓ భయం. సోషియా ఫ్యాంటసీ నేపథ్యంలో ‘యమదొంగ’ చేశాను. మంచి ఫలితం వచ్చింది. కానీ మధ్యలో ఇంకోసారి ట్రై చేస్తే (శక్తి సినిమాను ఉద్దేశించి) మాడు పగిగిలిపోయింది. మంచి కథ దొరికినపుడు.. ఇది చేస్తే బాగుంటుందనుకున్నపుడు చేస్తా. అలాంటి సినిమాల్ని తెరకెక్కించే సత్తా ఉన్న దర్శకులు మనకున్నారు’’ అని ఎన్టీఆర్ చెప్పాడు. మరోవైపు కెరీర్లో ప్రేమకథలు చేయలేకపోయాననే అసంతృప్తి తనకు ఉందని ఎన్టీఆర్ అన్నాడు. ‘‘ఆ విషయంలో బాధ ఉంది. కానీ ఇప్పుడు చేస్తే బాగోదేమో. పెళ్లయింది. అబ్బాయి కూడా ఉన్నాడు. ఇప్పుడు ప్రేమకథలంటూ పరుగెడితే బాగుండదని నా ఫీలింగ్’’ అని ఎన్టీఆర్ చెప్పాడు.