జూనియర్ ఎన్టీఆర్ బయటకి వస్తే సందడే సందడి ఉంటుంది కదండీ! అలాంటి హడావుడే రాజమండ్రి ఎయిర్ పోర్టులో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులతో కాకినాడకు వచ్చాడు తారక్. ఈ ప్రయాణంలో భాగంగా రాజమండ్రి విమానాశ్రయంలో దిగాడు. అంతే, అభిమానులు ఒక్కసారిగా సందడి చేశారు. కేరింతలు కొడుతూ పలకరించారు. తారక్ కూడా అభిమానులను పలకరించాడు. ఆ తరువాత రాజమండ్రి నుంచి కాకినాడకు పయనమయ్యాడు. ఇంతకీ.. ఉన్నట్టుండీ హఠాత్తుగా కాకినాడలో తారక్ ఎందుకు ప్రత్యక్షమైనట్టు అనే అనుమానం కలగడం సర్వసాధారణం. ఉన్నట్టుండి ఒకేసారిగా కాకినాడలో తారక్ ను చూసిన అభిమానులు కూడా ఇదే విషయమై చర్చించుకుంటున్నారు.
ఏదైనా కొత్త సినిమా షూటింగ్ కోసం కాకినాడ వచ్చాడా అనుకుంటే... కొత్త సంవత్సరంలోనే తారక్ తదుపరి చిత్రం మొదలయ్యేట్టుగా ఉంది. ప్రస్తుతానికైతే ఆ సందడే కనిపించడం లేదు. ఇంతకీ కాకినాడకు తారక్ వచ్చిన కారణం ఏంటంటే... అక్కడో కుటుంబ కార్యక్రమం జరిగింది. హరికృష్ణ మనవడు మాస్టర్ నందమూరి తారక రామారావుకు పంచెకట్టు ఫంక్షన్ కాకినాడలో జరిగింది. హరికృష్ణ కుమారుడు, తారక్, కల్యాణ్ రామ్ ల సోదరుడు జానకిరామ్ ఓ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడే మాస్టర్ ఎన్టీఆర్. దాన వీర శూర కర్ణ అనే చిత్రంలో కూడా ఈ కుర్రాడు నటించాడు. కాకినాడలో జరిగిన ఈ ధోతీ సెర్మనీకి తారక్ కుటుంబంతోపాటు కల్యాణ్ రామ్, హరికృష్ణలు కూడా హాజరయ్యారు. సో... కాకినాడకు తారక్ వచ్చిన కారణం అది.