ఇప్పటివరకు ఒక 49 సినిమాలను చేసిన లక్ష్మీ రాయ్.. తొలిసారిగా ''జూలి 2'' సినిమాతో బాలీవుడ్ లో లీడింగ్ లేడీ అవతారమెత్తుతోంది. ఇదే తొలిసినిమా అంటోంది. ఇదివరకు అకీరా వంటి చిన్నాచితకా సినిమాల్లో కనిపించీ కనిపించని రోల్స్ లో బాగానే మెరిసిందిలే. అయితే ఇప్పుడు ఈమె పూర్తి స్థాయి మెయిన్ లీడ్ చేస్తోంది కాబట్టి.. డెబ్యూటింగ్ అంటూ సోకులు పోతోంది. ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం పదండి.
ఆల్రెడీ టీజర్లోనే దర్శకుడు నిర్మాత అయిన దీపక్ శివదాసానీ సినిమాలో ఏముండబోతోందో చూపించేశాడు. ఇప్పుడు ట్రైలర్ లో కూడా అంతకంటే ఓ మెట్లు ఎక్కువ మోతాదులో హాటు సీన్లు ఉన్నాయి తప్పిస్తే.. పెద్దగా కంటెంట్ కనిపించలేదు. బాగా డబ్బులు ఖర్చపెట్టడంతో ప్రొడక్షన్ వాల్యూస్ బాగా ఉన్నాయని అనిపిస్తున్న ఈ సినిమాలో.. మరో డర్టీ పిక్చర్.. మరో హీరోయిన్.. మరో క్యాలెండర్ గాళ్స్.. వంటి సినిమాల కథలే తారసపడుతున్నాయి. ఒక అమ్మాయి పెద్ద స్టార్ అవ్వాలని అనుకుంటుంది. పెద్ద పెద్ద దర్శకుల నిర్మాతల పక్కలో తేలితేనే అది సాధ్యమని ఆ రూట్ ఎంచుకుంటుంది. పక్కా బి-గ్రేడ్ స్థాయి సినిమాను రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో లక్ష్మీ రాయ్ అందాలతో నింపేశారు అంతే. ఒక విధంగా చెప్పాలంటే.. కేవలం లక్ష్మీ రాయ్ ను ఓ నలభై యాభై బికినీల్లో నడిపించారు. న్యూడుగా చూపించేశారు. గ్లామర్ లవ్వర్ల మనస్సులో రచ్చ లేపారు అంతే.
అటు సినిమా కంటెంట్ ఎంత పేలవంగా ఉందో.. ఎక్స్ ప్రెషన్లే పలకని లక్ష్మీ రాయ్ యాక్టింగ్ కూడా అలాగే ఉంది. కాకపోతే ఈ సినిమాలోని అందాలు మాత్రం బి సి సెంటర్లలో బాగా పండుతాయి అంటున్నారు సినిమా నిపుణులు. సెమీ న్యూడ్ లో కూడా నటించడానికి వెనకడాని లక్ష్మీ రాయ్.. ఇప్పుడు ఈ ట్రైలర్ ను చూపించి తన హార్డ్ వర్కును గుర్తించమంటోంది. ఓసారి చూసి తరించి మీరూ గుర్తించండి మరి!!
Full View