పాత కథనే తిప్పి తీసినా క్షమించే గుణం తెలుగు ప్రేక్షకులకు ఉంటుందేమో కానీ యూనివర్శల్ ఆడియెన్‌కి అస్సలు ఉండదు. విమర్శకులైతే ఏకి పారేస్తారు. హ్యాపీడేస్‌ని కేరింత అంటూ తిప్పి తీసినా తెలుగు ప్రేక్షకులు చూశారు. కానీ అదే స్టీవెన్ స్పీల్ బర్గ్ తీసిన జురాసిక్ పార్క్‌ని తిప్పి తీసినందుకు కొలిన్ ట్రావెర్రో అనే దర్శకుడు తీవ్రమైన విమర్శల్ని ఎదుర్కొన్నాడు.
జురాసిక్ పార్క్ సిరీస్‌లో అతడు తెరకెక్కించిన జురాసిక్ వరల్డ్ వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించినా ఇది విమర్శకుల్ని అస్సలు ఆకట్టుకోలేకపోయింది. జురాసిక్ కథల్లే తిప్పి తీశాడు. ఎమోషన్ మిస్సయ్యిందంటూ చీవాట్లు వేశారు. ఏమాత్రం కొత్తదనం లేని కథ, కథనం అంటూ తిట్టిపోశారు. అదే తీరుగా టెర్మినేటర్ సిరీస్‌లో వచ్చిన 'జెనిసిస్' డైరెక్టర్‌ని అదే రేంజులో తిట్టారు. ఇది 90లలో వచ్చేసిన తెలుగు సినిమా 'ఆదిత్య 369'కి రీమేక్ అంటూ తేల్చేశారు కొందరైతే. అలన్ టేలర్ మరోసారి టెర్మినేటర్ కథలన్నిటినీ కలిపి కొత్త కథ రాసుకున్నాడంతే. అతడు కొత్తగా తీసిందేం లేదని విమర్శకులు విరుచుకుపడ్డారు.
అయితే జురాసిక్ వరల్డ్ దర్శకుడు కొలిన్ ట్రవెర్రో.. స్టీవెన్ స్పీల్‌బర్గ్‌కి శిష్యుడు. అలాగే అవతార్ ఫేం జేమ్స్ కామెరూన్‌కి టేలర్ శిష్యుడు. కాని మనోళ్ళు తమ గురువుల టైపులో ఏ మాత్రం మ్యాజిక్ చేయలేకపోయారు. ఈసారి మన బాక్సాఫీస్ దగ్గర హాలీవుడ్ పప్పులేం ఉడకలేదు.