ఇంటి నిర్మాణం వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన నటుడు సోనూ సూద్ కు ఊరట లభించింది. అతడి రెగ్యులేషన్ దరఖాస్తుపై నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తీర్పు అనంతరం ట్వీట్ చేసిన సోనూసూద్.. న్యాయమే గెలుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇవిప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
సోనూ సూద్ కు చెందిన నివాసం ముంబైలో ఉంది. అయితే ఈయన నివాస సముదాయాన్ని ఇతర అవసరాలకు వాడుకుంటున్నాడని గతంలో ముంబై కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది. పలు నిర్మాణాలను కూల్చివేసింది. దీనిపై సోనూసూద్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తాజాగా ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
కాగా ముంబై కార్పొరేషన్ , శివసేన సర్కార్ బీజేపీకి మద్దతుగా ఉన్న నటులపై వారి నివాసాలపై కొద్దిరోజులుగా ఇలాంటి దాడులు చేయిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. కంగనా రౌనత్, సోనూసూద్ లాంటి వారి ఆస్తులపై కూడా ఇలానే నోటీసులు ఇచ్చి కోర్టుల్లో మహారాష్ట్ర సర్కార్ కు ఎదురుదెబ్బలు తగిలాయి.