తెలుగు సినిమాలకు లోకల్ మార్కెట్.. యుఎస్ మార్కెట్ భిన్నంగా ఉంటాయి. అమెరికాలో ఆడాలంటే ఆ సినిమాలకు క్లాస్ టచ్ ఉండాలి. ఫ్యామిలీ ఎంటర్టైనర్లు అయి ఉండాలి. ఆహ్లాదంగా సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్లకు అక్కడ మంచి ఫలితాలు వస్తుంటాయి. ‘జ్యో అచ్యుతానంద’ సరిగ్గా ఇలాంటి సినిమానే కావడంతో అమెరికాలో చక్కటి ఆదరణ పొందుతోంది. ప్రిమియర్లతో కలిపి తొలి రోజు లక్ష డాలర్లకు పైనే వసూలు చేసిన ఈ సినిమా.. రెండో రోజు అనూహ్యమైన వసూళ్లు సాధించింది. ఏకంగా 1.5 లక్షల డాలర్లు కొల్లగొట్టింది. ఆదివారం 50 వేల డాలర్లు వచ్చాయి.
మొత్తంగా ఇప్పటిదాకా ఈ సినిమా 3.2 లక్షల డాలర్లు వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు రావాలంటే హాఫ్ మిలియన్ క్లబ్బులో చేరాలి. అది పెద్ద కష్టం కూడా కాకపోవచ్చు. వచ్చే వారం పెద్ద సినిమాలేమీ లేవు కాబట్టి ‘జ్యో అచ్యుతానంద’ జోరు కొనసాగవచ్చు. ఫుల్ రన్లో 6-7 లక్షల డాలర్ల మధ్య వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా బాగానే ఆడుతోంది. ప్రస్తుతం ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ ఇదే. రెండో వారాంతానికి బయ్యర్లందరూ లాభాల బాటలోకి వచ్చేస్తారని భావిస్తున్నారు. మంచి సినిమాలు తీసే సాయి కొర్రపాటి చాన్నాళ్ల తర్వాత ఓ కమర్షియల్ సక్సెస్ అందుకున్నందుకు అందరూ హ్యాపీగా ఉన్నారు.