కింగ్ నాగార్జున 50 ప్లస్ వయసులోనూ నవమన్మధుడిగా అలరిస్తున్న సంగతి తెలిసిందే. లేటు వయసులోనూ ఆయనకు క్రేజు ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల తన వయసుకు తగ్గ పాత్రల్ని ఎంపిక చేసుకుంటూ నవతరం హీరోల్ని కలుపుకుని మల్టీస్టారర్లలో నటించేందుకు నాగార్జున ఆసక్తి చూపిస్తున్నారు. 2018లో రిలీజైన `దేవదాస్` ఈ కోవకే చెందుతుంది. నానితో కలిసి ఆ సినిమాలో నటించారు కింగ్. ప్రస్తుతం వరుసగా రెండు సీక్వెల్స్ లో నటిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో `మన్మధుడు 2` ఇటీవలే ప్రారంభమైంది. 2002లో కింగ్ నటించిన `మన్మధుడు` చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ సినిమా తర్వాత `సోగ్గాడే చిన్ని నాయనా` (2016) సీక్వెల్ `బంగార్రాజు`లో నటిస్తున్నారు. ఈ సినిమాని త్వరలోనే ప్రారంభించనున్నారు. సోగ్గాడే ఫేం కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. అలాగే కాస్టింగ్ సెలక్షన్ సాగుతోంది.
`బంగార్రాజు` సరసన కథానాయికను వెతుకుతున్నారని తెలుస్తోంది. దర్శకహీరోలు పలువురు అగ్ర కథానాయికల పేర్లను పరిశీలించారు. కింగ్ సరసన తలైవి నయనతార కథానాయికగా నటిస్తే బావుంటుందని తొలత భావించారట. ఇటీవలే నయన్ ని టీమ్ సంప్రదించిందని తెలుస్తోంది. అయితే బిజీ షెడ్యూల్స్ వల్ల నాగార్జున సరసన నటించలేనని నయన్ చెప్పేశారట. నయనతార ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన `సైరా-నరసింహారెడ్డి` - సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన `దర్బార్` చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు పలు లేడీ ఓరియెంటెడ్ కథల్ని పరిశీలిస్తున్నారట. అందువల్ల నయన్ కి కాల్షీట్ల సమస్య తలెత్తిందని తెలుస్తోంది.
నయనతార తర్వాత ఆప్షన్ గా `మాస్` ఫేం జ్యోతికను సంప్రదించారని తెలుస్తోంది. నయనతార తరహలోనే గొప్ప పెర్ఫామర్ గా జ్యోతికకు సౌత్ లో అంత పెద్ద ఇమేజ్ ఉంది. ఇటీవల ఫ్యామిలీ లైఫ్ వల్ల తాను సెలక్టివ్ గా మాత్రమే నటిస్తున్నారు. అయితే నాగార్జున సరసన ఇదివరకూ మాస్ చిత్రంలో నటించారు కాబట్టి తాజా ఆఫర్ కి ఓకే చెబుతారనే అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమాకి జ్యోతిక సంతకం చేశారా.. లేదా? అన్నదానిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. బంగార్రాజు టీమ్ నుంచి అధికారిక ప్రకటన రాలేదింకా. ఠాగూర్ - చంద్రముఖి - మాస్ వంటి చిత్రాలతో జ్యోతిక తెలుగు ప్రేక్షకుల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఇటీవలే `నవాబ్` చిత్రంలోనూ అరవింద స్వామి భార్య పాత్రలో మెప్పించారు. 36 వయదినిలే - నాచియార్ చిత్రాలతో తమిళ ప్రేక్షకుల్ని మెప్పించి అక్కడ కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.