అవార్డ్ విన్నింగ్ దర్శకుడితో జ్యోతిక

Update: 2016-02-16 05:30 GMT
తమిళ సూపర్ స్టార్ సూర్యతో పెళ్లైన తర్వాత జ్యోతిక దాదాపు సినిమాలకు దూరంగానే ఉంది. కానీ అప్పుడప్పుడూ మంచి సినిమాలతో మాత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఆమె.  36 వయదినిలే చిత్రాన్ని జ్యోతికకు రీఎంట్రీ అనాల్సిందే. ఆ మూవీతో ప్రేక్షకుల ప్రశంసలతో కమర్షియల్ గానూ హిట్ సాధించింది ఈ మాజీ హీరోయిన్.

తన ఏజ్ కు తగ్గట్టుగా మెచ్యూర్డ్ పాత్రతో ప్రేక్షకులను మెప్పించిన జ్యోతికకు.. తర్వాత వరుసగా ఆఫర్స్ వచ్చాయి. అయినా సరే ఆమె వేటినీ ఒప్పుకోలేదు. అవకాశాలను అన్నిటినీ ఒప్పేసుకునే బదులు.. తన ప్రతిభకు గుర్తింపునిచ్చే పాత్రలను మాత్రమే చేయాలని నిర్ణయించుకుంది జ్యోతిక. ఇప్పుడు ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కోలీవుడ్ అంతటా ఆసక్తి నెలకొంది. బ్రమ్మ అనే డైరెక్టర్ చెప్పిన ఓ స్క్రిప్ట్ నచ్చడంతో.. వెంటనే ఓకే చెప్పేసిందామె.

కుట్రం కడితాల్ చిత్రాన్ని తీసిన దర్శకుడు బ్రమ్మ. ఈ మూవీ విమర్శకుల మెప్పు పొందడమే కాదు.. బెస్ట్ ఫీచర్ ఫిలింగా నేషనల్ అవార్డ్ కూడా గెలుచుకుంది. ఈయనే జ్యోతికకు ఓ స్టోరీ చెప్పాడు. ఇందులో వ్యక్తిత్వ పరంగా స్ట్రాంగ్ అయిన ఓ మహిళ కేరక్టర్ బేస్డ్ గా సినిమా నడుస్తుంది. ఈ పాత్ర, స్వభావం నచ్చడంతో.. వెంటనే సరే చెప్పేసింది జ్యోతిక. మిగిలిన పనులన్నీ పూర్తి చేసి.. రెండు నెలల్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించే అవకాశాలున్నాయి.
Tags:    

Similar News