నటసింహా బాలయ్య కెరీర్ 99వ సినిమాలో నటిస్తున్నాడు. శ్రీవాస్ దర్శకత్వంలో డిక్టేటర్ ప్రస్తుతం ఆన్‌సెట్స్ ఉంది. ఈ సినిమా పూర్తవ్వకముందే బాలయ్య 100వ సినిమాకి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పట్నుంచే కథాచర్చలు సాగుతున్నాయి. సింహా, లెజెండ్ వంటి రెండు బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను ఇప్పటికే ఓ లైన్ చెప్పాడు. పూర్తి స్థాయిలో స్క్రిప్టు డెవలప్‌మెంట్ పనిలో ఉన్నాడు.
ఇక ఎట్టి పరిస్థితిలో బోయపాటికే ఈ అవకాశం అని అంతా అనుకుంటున్న టైమ్‌లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఎంటరయ్యారు. బాలయ్యను శ్రీకృష్ణ దేవరాయలుగా చూపించాలని తపిస్తున్నారాయన. శ్రీకృష్ణ దేవరాయలు అన్నా, తెలుగు భాష అన్నా బాలయ్యకు విపరీతమైన మక్కువ. సరిగ్గా ఇదే సెంటిమెంటుని కె.ఆర్ తెలివిగా క్యాష్ చేసుకోవాలని ప్లాన్ వేశాడు. బాలయ్య 100వ సినిమా తనకి కూడా రీఎంట్రీ సినిమా కావాలని రాఘవేంద్రరావు భావిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు రెడీ అవుతోంది. శ్రీకృష్ణదేవరాయలుకి ఆదిత్య 369 సినిమాకి లింకుంది. బాలయ్య నటించిన ఆదిత్య 369 అప్పట్లో ట్రెండ్ సెట్టర్. టైమ్ మెషీన్‌లో దేవరాయల కాలానికి వెళ్లిపోయిన నేటి నరమానవుడు అక్కడ ఏం చేశాడన్నది ఆసక్తికరం.
ప్రస్తుతం రాఘవేంద్రరావు శ్రీకృష్ణ దేవరాయలుని ఏ కోణంలో చూపించాలనుకుంటున్నాడు? అన్నది వేచి చూడాల్సిందే. పురాణేతిహాసాలు, రాజులు, రాజ్యాలు అంటే బాలయ్యకు కూడా ఇష్టమే. భైరవద్వీపం వంటి క్లాసిక్ సినిమాతోనూ బాలయ్య ఆకట్టుకున్నాడు. కాబట్టి ఏం జరగడానికైనా ఆస్కారం ఉందని అంటున్నారు. 100వ సినిమా రేసులో బోయపాటి, రాఘవేంద్రరావు ఇద్దరిలో విజయం ఎవరిని వరిస్తుందో?