సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు రికార్డులు బద్దలుకొట్టడం కొత్తేమీ కాదు. రజనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కాలా కూడా ఇప్పుడు ఓ రికార్డు బద్దలు కొట్టింది. అసలు అడ్వాన్స్ బుకింగ్ లే లేని సినిమా అంత రికార్డు ఎలా బద్దలు కొట్టగలిగిందనే అనుమానం రావచ్చు. కానీ కాలా సినిమా రికార్డు సాధించింది కలెక్షన్లలో కాదు.. పైరసీలో.
ఇంతవరకు సినిమా రిలీజైన రోజు.. కొన్నిసార్లు గంటల వ్యవధిలో పైరసీ ప్రింట్లు నెట్ లో ప్రత్యక్షం అయిపోతున్నాయి. కాలా సినిమా ఇంకా ఇండియాలో రిలీజ్ కాకముందే ఫేస్ బుక్ లో లైవ్ టెలికాస్ట్ అయిపోయింది. ఆశ్చర్యం కలిగించినా ఇప్పటివరకు పైరసీ లో ఇదే రికార్డ్. సింగపూర్ లోని కాథే సినీప్లెక్స్ లో జూన్ 6న కాలా ప్రీమియర్ షో వేశారు. దీనికి వెళ్లినవారిలో ప్రవీణ్ తేవర్ అనే నెటిజన్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో కాలా సినిమా స్టార్టయిన క్షణం నుంచే లైవ్ లో సినిమా చూపించడం మొదలెట్టాడు. ఇలా మొదటి 40 నిమిషాల సినిమా ఫేస్ బుక్ లైవ్ లో బోలెడు మంది చూసేశారు.
ఇంతలో ఇది రజనీ ఫ్యాన్స్ కు తెలియడంతో తమిళ నటుల సంఘం అధ్యక్షుడు - హీరో విశాల్ దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే రంగంలోకి దిగిన విశాల్ అఫీషియల్స్ ను అలెర్ట్ చేసి అతి తక్కువ టైంలో సినిమాను ఫేస్ బుక్ లో పెట్టిన ప్రవీణ్ తేవర్ ను అరెస్టు చేయించాడు. విశాల్ ఫాస్ట్ గా రియాక్ట్ కాబట్టి సరిపోయింది కానీ లేకుంటే సినిమా మొత్తం లైవ్ లో వచ్చేసేది. ఈ సంఘటన తమిళ ఇండస్ట్రీని మాత్రం షాక్ కు గురిచేసింది.