ఇప్పటివరకూ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా కబాలిపై చాలా డౌట్స్. అసలు ఎందుకు లేట్ చేస్తున్నారు? రిలీజ్ విషయంలో అంత లేట్ ఎందుకు? ఇప్పటికి అరడజన్ సార్లు పోస్ట్ పోన్ చేశాక.. ఈసారి చెప్పిన డేట్ అయిన జూలై 22న విడుదలవుతుందా లాంటి అనుమానాలు చాలానే ఉన్నాయి. వీటన్నిటికీ ఒకే ఒక సమాధానంతో చెక్ పెట్టేశాడు తమిళ్ వెర్షన్ ప్రొడ్యూసర్ కలైపులి థాను.
కబాలి గురించి ప్రొడ్యూసర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే.. 'కబాలికి ఇప్పుడు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయిపోయాయి. సినిమాకి సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికేట్ వచ్చింది. సినిమా నిడివి 152 నిమిషాలు. ఇక అన్నీ సంబరాలే అని చెప్పాడు కబాలి నిర్మాత. అంటే ఈ లెక్కన కబాలి రిలీజ్ కి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లే. అయితే కలైపులి థాను ఇంత చెప్పాడు కానీ.. ఓ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అదే రిలీజ్ డేట్. ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ చేతిలో ఉంది.. కావలసిననన్ని థియేటర్లు వస్తాయ్ కాబట్టి జూలై 15న అయిన విడుదల చేసేసే ఛాన్స్ ఉంది.
అయితే.. ఇప్పటివరకూ పబ్లిసిటీ యాక్టివిటీస్ పెద్దగా ఊపందుకోకపోవడంతో.. కబాలిని జూలై 22న విడుదల చేసేందుకే నిర్మాతలు మొగ్గుతున్నారు. ఇతర భాషల్లో ప్రచారం చేసుకునేందుకు కూడా ఇప్పుడు టైమ్ లభించినట్లే. మొత్తానికి సూపర్ స్టార్ సెన్సేషన్స్ కి మరో పది రోజుల గ్యాప్ ఉందంతే.. బీ ప్రిపేర్ ఇక.