కబాలిలా మెగా 150.. వద్దు బాబోయ్

Update: 2016-07-28 21:30 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ కబాలి సృష్టించిన రికార్డులు చూసి.. మెగా 150పై చాలా రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. చిరంజీవి రీఎంట్రీ మూవీ కూడా కబాలి మాదిరిగా రికార్డులు సృష్టించాలని.. లేకపోతే ఏదో తేడా జరిగిపోతుందని.. తక్కువ అనే ఫీలింగ్ అనే వస్తుందని.. ఇలాంటి పిచ్చిపిచ్చి కామెంట్స్ ఏవో వచ్చేస్తున్నాయి.

అసలు కబాలిలా మెగా 150 ఉండాలని అనుకోవడమే ఓ పనిలేని ఊహ. సినిమాలో రజినీ చూపించే ఒకటి అరా ఎనర్జిటిక్ ఫీలింగ్స్ ని.. సీన్స్ ని ట్రైలర్ లో గుప్పించేసి.. లేనిపోని హైప్ తెచ్చి విడుదల చేశారు. దాంతో ఓపెనింగ్ వీకెండ్ రికార్డుల తప్ప వేరే ఏదీ ఈ సినిమాకు దక్కే పరిస్థితి లేదు. 80శాతం మందికి పైగా డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోతున్నారు. తెలుగులో డబ్బింగ్ వెర్షన్ ని కొనుగోలు చేసిన వాళ్లకే 8 కోట్ల మేర నష్టాలు వస్తాయని అంచనా.

చిరు రీఎంట్రీ మూవీ అందరికీ లాభాలు పంచాలని.. ఇండస్ట్రీలో మెగాస్టార్ స్టామినా ప్రూవ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఓ ఫ్లాప్ సినిమాతో కంపేర్ చేసి రికార్డులు కొట్టేయాలనే ఫీలింగ్ ఏ మాత్రం సరికాదు. సూపర్ హైప్ క్రియేట్ చేసి ఒకటి అరా రికార్డులతో సరిపెట్టేసే కంటే.. మెగాస్టార్ స్టైల్ లో సినిమా తీసి.. అందరికీ లాభాలు ఇవ్వడమే కరెక్ట్.
Tags:    

Similar News