టాక్ సంగతి ఎలా ఉన్నా సూపర్ స్టార్ రజినీకాంత్ కబాలి ఇప్పటికే ప్రీమియర్లతో రికార్డులు బద్దలు కొట్టేస్తున్నాడు. ఇక రిలీజ్ రోజు నమోదు కాబోయే సంచలనాల కోసం అందరూ వెయిటింగ్ చేస్తున్నారు. రజినీ బొమ్మ చూశాకే.. ఏ రివ్యూలనయినా.. ఏ టాక్ నయినా పట్టించుకుంటాం.. అప్పటివరకూ ఏదీ లెక్క చేసేది లేదని చెప్పేస్తున్నారు అభిమానులు.
ఇక ఇప్పటికే సినిమా చూసినోళ్లయితే.. నెట్ లో హంగామా చేసేస్తున్నారు. మొదటగా మలేషియాలో స్పెషల్ ప్రీమియర్ షో పడగా.. ఆ తర్వాత అమెరికాలో ప్రీమియర్లు పడ్డాయి. అక్కడి నుంచి డివైడ్ టాక్ గట్టిగానే మొదలైంది. మొత్తానికి అందరూ చెప్పే మాటంటే.. ఫస్టాఫ్ చాలా అంటే చాలా ఎమోషనల్ గా నడిచే స్క్రీన్ ప్లే ఉంటుంది. ఊహించని ట్విస్ట్ ఇచ్చి ఇంటర్వెల్ లాక్ చేస్తారు. సెకండాఫ్ నెరేషన్ స్లోగా అనిపిస్తుంది. అయితే.. ఓల్డేజ్ గెటప్ రజినీకాంత్ చేసే విన్యాసాలు చూసి మాస్ ఫ్యాన్స్ పండగ చేసేసుకుంటున్నారు. ఈ మాస్ స్ర్కీన్ ప్లే కేక అనేస్తున్నారు అభిమానులు. ముఖ్యంగా తమిళ అభిమానులకు అయితే.. తమిళుల గురించి చెప్పే ఒక డైలాగ్ రచ్చలా ఉందంట.
రజినీ మూమెంట్స్ చూస్తే ఫ్యాన్స్ కి సంబరాలు ఖాయం కానీ.. నెరేషన్ పరంగా సినిమా కొందరికి నచ్చడంలేదని తెలుస్తోంది. రజినీ స్టైల్ పంచ్ లు తక్కువగా ఉండటం వలన కూడా మైనస్ పాయింట్ గా చెప్పుకుంటున్నారు. రెండున్నర గంటల సినిమానే అయినా.. సెకండాఫ్ స్లోగా ఉండడంతో.. బాగా పెద్ద మూవీ అనే ఫీలింగ్ వస్తోందిట కొంతమంది సినిమా లవర్లకు. ఇలాంటి టాక్ లన్నీ మిగతావాళ్లమీద ఎఫెక్ట్ చూపిస్తాయేమో కానీ.. రజినీ ముందు ఆయన స్టామినా ముందు దిగదుడుపే అంటున్నారు ఫ్యాన్స్.