ఇప్పుడు ''కబాలి'' ఫెయిల్యూర్ ను చూశాక తెలుగులో రెండు సినిమాల గురించి డిస్కషన్లు మొదలయ్యాయ్. ఒకటి మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా అయితే.. రెండవది నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ రెండు సినిమాల దర్శకులు కూడా ఒక్కసారి కబాలి నేర్పే క్లాసులు చూసుకోవాల్సిందే. లేకపోతే సీన్ సితార్ అయిపోతుంది.
ఇప్పటివరకు తీసిన సినిమాలన్నింటిలోనూ కంటెంట్ పరంగా ఇంప్రెస్ చేశాడు దర్శకుడు క్రిష్. కాని బాలయ్యతో సినిమా అంటే మాత్రం.. అభిమానుల అంచనాలు కూడా ఉంటాయి. వాటిని అందుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే కబాలి టైపులో మొదటి ఆటకే నెగెటివ్ టాక్ వచ్చేస్తుంది. ఫ్యాన్స్ కోసం కొన్ని సీన్లయినా పెట్టాల్సిందే. సినిమాలను బ్రతికించేది ఈ అభిమానులు.. వారికోసం ఆ మాత్రం తీయకపోతే ఎలా.
ఇకపోతే దర్శకుడు వినాయక్ దగ్గరకు వస్తే.. ఆయన గత సినిమాల్లో.. నాయక్ సినిమాలో మ్యాటర్ లేకపోయినా రామ్ చరణ్ చరిష్మా వలన ఆడేసింది. అదే కొత్త కుర్రాడు అఖిల్ విషయానికొస్తే వినాయక్ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. దానికితోడు సినిమాను భుజాల మీద వేసుకుని మోసే స్టార్ క్యాస్ట్ లేకపోవడంతో.. టోటల్ గా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కథ అనేది లేకపోవడం పెద్ద మైనస్. కాని 150వ సినిమా కోసం రీమేక్ స్టోరీ తీసుకున్నారు కాబట్టి.. కావల్సినంత కథ ఉంది. మరి వినాయక్ ఇప్పుడైనా తన టాలెంటును బాగా చూపించాలి. లేకపోతే రిజల్టు తేడా పడుతుంది.
కబాలి సినిమా రిజల్టు చూశాక.. అందరూ నేర్చుకోవాల్సిన ఒక కామన్ విషయం ఏంటంటే.. ఊరికనే హైప్ క్రియేట్ చేసేసి.. టీజర్లతో బాషా సినిమాను ప్రామిస్ చేసి లోపల మాత్రం పంజా సినిమా చూపిస్తే.. వెంటనే నెగెటివ్ టాక్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ కొన్ని షరతులు వర్తిస్తాయి. కొన్ని సినిమాల్లో కంటెంట్ లేకపోయినా హైప్ కారణంగా ఆడేస్తుంటాయి. ఎప్పుడో పుష్కరానికి ఒక సారి అలా లక్ కలిసొస్తుందిలే.