దగ్గుబాటి రానా కొత్త సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ టీజర్ ఇప్పటికే జనాల్లో ఈ సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. ఈ ఊపును కొనసాగిస్తూ ఆసక్తికర ప్రమోషన్ తో సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది చిత్ర బృందం. తాజాగా ‘నేనే రాజు నేనే మంత్రి’లో హీరోయిన్ల క్యారెక్టర్లను వెరైటీగా ఇంట్రడ్యూస్ చేశారు. ‘నేనే రాధ.. నేనే భార్య’ అంటూ కాజల్ ను చీరకట్టులో చూపించిన చిత్ర బృందం.. ‘కాదు నేనే రాణి.. నేనే భార్య’ అంటూ మోడర్న్ లుక్ లో కేథరిన్ థ్రెసాను లుక్ ను పరిచయం చేసింది. సినిమాలో హీరోయిన్ల పేర్లు రాధ.. రాణి అని హింట్ కూడా ఇచ్చారు. దీన్ని బట్టి సినిమాలో హీరో కోసం వీళ్లిద్దరూ కొట్టుకుంటారని అర్థమవుతోంది.
ఇలాంటి క్రియేటివ్ ప్రమోషనే జనాల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇక్కడ సురేష్ ప్రొడక్షన్స్ ముద్ర కనిపిస్తోంది. చిత్రం.. నువ్వు నేను.. జయం లాంటి సినిమాలతో ఒకప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఒక వెలుగు వెలిగిన తేజ.. పుష్కర కాలం నుంచి హిట్టు ముఖం చూడలేదు. తేజ చివరి సినిమా ‘హోరాహోరీ’ వచ్చింది తెలియదు.. వెళ్లింది తెలియదు. ‘నేనే రాజు నేనే మంత్రి’ ఆయనకు అత్యావశ్యకమైన విజయాన్ని అందించేలాగే కనిపిస్తోంది. ఈ సినిమా ఎంత బాగుంటుందన్నది పక్కన పెడితే.. తేజ గత సినిమాల్లాగా అయితే ఉండదని మాత్రం అర్థమవుతోంది. తొలిసారి ఫుల్ లెంగ్త్ పొలిటికల్ మూవీ చేస్తున్న తేజ.. ఎలా తన ప్రత్యేకతను చాటుకుంటాడో చూద్దాం. జులైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/