కాజ‌ల్ బ్యూటీ సీక్రెట్ ప‌ప్పు అన్న‌మా?

Update: 2023-07-03 13:34 GMT
చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ బ్యూటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు పెళ్లి చేసుకుని ఓ బిడ్డ‌కు త‌ల్లైనా! అదే బ్యూటీతో ఆక‌ట్టుకుంటుంది. న‌వ నాయిక‌లా అవ‌కాశాలు అందుకోవ‌డంలోనూ దూకుడు చూపిస్తుంది. యూత్ లో క్రేజీ భామ‌గా  దూసుకుపోతుంది. మ‌రి ఈ బ్యూటీ వెనుక సీక్రెట్ ఏంటి? అంద‌రా జిమ్ కి వెళ్ల‌డం..24 గంట‌లు నీళ్లు తాగ‌డం! మితంగా తిన‌డం వంటివి అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. కాజ‌ల్ బ్యూటీ లెక్క ఇక్క‌డ వేరే ఉంది.

ఉద‌యాన్ని చిన్న పాటి ఎక్స‌ర‌సైజులు ముగించిన త‌ర్వాత ఉడ‌క‌బెట్టిన  గుడ్డు తింటుందిట‌. దాంతో పాటు ఒకొ జొన్న రొట్టే క‌ర్రీతో పాటు  తీసుకుంటుందిట‌. ఇక మ‌ధ్నాహ్నం లంచ్ లో...రాత్రి డిన్న‌ర్ లో క‌చ్చితంగా ప‌ప్పు ఉండాల్సిందేన‌ట‌. రెండు పూట‌లు రైస్ త‌ప్ప‌కుండా ప‌ప్పుతోనే తింటుందిట‌. ఇంట్లో ఉన్నా..సినిమా సెట్స్ లో ఉన్నా? ఆ రెండు పూట‌లు ప‌ప్పు ఉండాల‌ని ముందే చెబుతుందిట‌. ప‌ప్పు చాలా ఇష్టంగా తింటుందిట‌.

సాయ‌త్రం పూట శాండ్ వించ్ తింటుందిట‌. కానీ నాన్ వెజ్ మాత్రం ముట్టుకోద‌టు. దాని వాసన కూడా ప‌డ‌దంట‌.  పూర్తిగా శాఖాహారిని అంటోంది. అప్పుడ‌ప్పుడు అన్నంలోకి రాజ్మా చావ‌ల్ తీసుకుంటుందిట‌. ప‌న్నీరు కూడా  ఎంతో ఇష్టంగా తింటుందిట‌.

దీని వ‌ల్ల ప్యాట్ ఫామ్ అవుతుంద‌ని తెలిసినా తింటుందిట‌.  అలాగే ప్ర‌తీ రోజు ప్రోటీన్  షేక్స్..కొబ్బ‌రి నీళ్లు తాగుతుంటా. చీట్ మీల్  డే రోజు మాత్రం అమ్మ చేసే ప‌రోటాలు క‌నీసం ప‌దైనా లాంగించాల్సిందే అంటోంది.

అలాగే అమ్మ‌డు మంచి మ్యూజిక్ ప్రియురాలు అట‌.  ఇళ‌య‌రాజా పాటలు ఎక్కువ‌గా  వింటుందిట‌.  మ‌ణిర‌త్నం సినిమాలు అప్పుడ‌ప్పుడు చూస్తుందిట‌.  పుస్త‌కాలు కూడా బాగానే చ‌దువుతుందిట‌. రీడింగ్ హ్యాబిట్  చిన్న‌ప్ప‌టి నుంచి ఉందిట‌.

ఆయ‌న్ రౌండ్ రాసిన ఫౌంటెన్  హెడ్ పుస్త‌కం ఎంతో ఇష్టంగా చ‌దువుతుందిట‌.   ఇక అమ్మ‌డు న‌టిగా ఎంత బిజీగా ఉందో చెప్పాల్సిన ప‌నిలేదు.  తెలుగులో మూడు సినిమాలు చేస్తోంది. అలాగే  ఇండియ‌న్ -2లోనూ న‌టిస్తోన్న సంగ‌తి  తెలిసిందే.

Similar News