ప్రస్తుతం కాజల్ ఫుల్ జోష్ లో ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ - సూపర్ స్టార్ మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం చేస్తోంది టాలీవుడ్ చందమామ. ఈ రెండు సమ్మర్ కే రిలీజ్ కానుండడంతో.. టాలీవుడ్ లో మళ్లీ టాప్ రేంజ్ కి వెళ్లే ఛాన్స్ కాజల్ కి వచ్చింది. ఇప్పుడు తమిళ్ లోనూ మరో క్రేజీ ప్రాజెక్టులో స్థానం సంపాదించేసింది ఈ భామ.
టాలీవుడ్ లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ ఏ రేంజ్ లో హిట్ సాధించిందో చూశాం. ఈ చిత్రాన్ని ఇప్పుడు తమిళ్ లో శింబు రీమేక్ చేస్తున్నాడు. తెలుగు టెంపర్ లో హీరోయిన్ కాజల్ ను తమిళ్ వెర్షన్ కి కూడా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. జంతు ప్రేమికురాలిగా అమ్మడి యాక్షన్ క్లిక్ కావడం, కాజల్ కు కోలీవుడ్ లో కూడా మంచి డిమాండ్ ఉండడంతో.. ఈమెనే తమిళ్ వెర్షన్ కు కూడా తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.
విజయ్ చందర్ డైరెక్షన్ లో, మైకేల్ రాయప్పన్ నిర్మాతగా ప్రారంభమయ్యే టెంపర్ రీమేక్.. త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనుంది. జూన్ నుంచి ఈ మూవీ షూటింగ్ లో కాజల్ జత కానున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ వరుసగా క్రేజీ ప్రాజెక్టులు, పెద్ద స్టార్ల పక్కన ఆఫర్లు పట్టేస్తూ తన స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేస్తోంది కాజల్ అగర్వాల్.