ఫోటో స్టోరి: 'పక్కా లోకల్' పాపను చూశారా?

Update: 2016-08-24 04:27 GMT
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం డిజాస్టర్ల సీజన్ లో ఉన్నా.. అమ్మడికి ఆఫర్లు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు కూడా లేనన్ని భారీ సినిమాలకు వరుసగా సైన్ చేసేస్తూ.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హీరోయిన్ గా వెలిగిపోతూనే.. జనతా గ్యారేజ్ లో ఐటెం సాంగ్ కి కూడా చిందులేసింది.

తన షూటింగ్స్ కు సంబంధించి రెగ్యులర్ అప్ డేట్స్ ఇచ్చే అలవాటున్న కాజల్.. పక్కా లోకల్ లుక్ ని అభిమానులతో పంచుకుంది. జనతా గ్యారేజ్ లో తను ఎలా కనిపించబోతోందో ఓ గెటప్ కి సంబంధించిన  పిక్చర్ రివీల్ చేసింది. ఐటెం గాళ్ అన్నంత మాత్రాన.. డ్రసింగ్ లో మరీ ఊర మాస్ ఏమీ చూపించడం లేదీ భామ. కాకపోతే లుక్ అండ్ గెటప్ లో మాత్రం కొత్తగానే ట్రై చేసింది. పెద్ద ముక్కుపుడకతో నీలం రంగు బొట్టుతో.. ఐటెం గాళ్ కి కొత్త కలర్ తీసుకొచ్చేందుకు కాజల్ ప్రయత్నించింది.

రీసెంట్ గా జనతా గ్యారేజ్ షూటింగ్ ఫినిష్ అయిపోయిందంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పేశాడు. ఈ సినిమాని పక్కా లోకల్ ఐటెం సాంగ్ తో పూర్తి చేశారు. కాజల్ ఈ పాటలో డ్యాన్సులేసిందని తెలుసు కానీ.. అమ్మడిని ఆ టైపులో ఇప్పటివరకూ చూడని జనాలు ఈ గెటప్ చూసిన తర్వాత.. ఐటెం కాజల్ భలేగుందే అనుకుంటున్నారు. సెప్టెంబర్ 1 వరకు ఆగితే.. ఐటెం సాంగ్ మొత్తం చూసి ఎంజాయ్ చేయచ్చు కానీ.. ఈలోగానే జనతా గ్యారేజ్ ప్రమోషన్స్ లో కూడా కాజల్ ఐటెం సాంగ్ ని బాగానే ఉపయోగించుకోబోతున్నారట.

Tags:    

Similar News