తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఏ స్థాయిలో సెన్సేషన్ అనే సంగతి చెప్పాల్సిన పని లేదు. తమిళ జనాలతో అమ్మ అని పిలిపించుకున్న జయలలిత.. ఇప్పటికీ వాళ్ల మనసుల్లో చిరస్థాయిలో నిలిచిపోయారు. ఇప్పుడు ఓ సినిమాలో ఆమె పాత్రలో నటించాలంటూ కాజల్ అగర్వాల్ కు ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది.
జయలలిత కథతో బయోపిక్ తెరకెక్కించే ప్రయత్నాలు ఉన్నాయి కానీ.. అది తమిళ సినిమా. కానీ కాజల్ కు ఆఫర్ వచ్చిన సినిమా అది కాదు. తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ ను బాలకృష్ణ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించాల్సిందిగా చందమామకు ఆఫర్ వచ్చిందట. అది కూడా జయలలిత పాత్ర కోసం అని తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ లో ప్రతీ ఫ్రేమ్ ను విజువల్ వండర్ గా ఉండేలా దర్శకుడు తేజ.. హీరో బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నారు. అందుకోసమే జయలలిత రోల్ కోసం కాజల్ ను అప్రోచ్ అయ్యారని అంటున్నారు. ఎన్టీఆర్- జయలలిత కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఎన్నేసి సెన్సేషన్స్ సృష్టించాయో తెలిసిందే.
ఇటు కాజల్ అగర్వాల్ ను జయలలితగా నటింపచేసేందుకు ప్రయత్నిస్తూనే.. మరోవైపు శ్రీదేవి పాత్ర కోసం బాలీవుడ్ టాప్ స్టార్ దీపికా పదుకొనేను ప్రయత్నిస్తున్నారు ఎన్టీఆర్ మూవీ యూనిట్. అయితే.. ఇవన్నీ సుదీర్ఘంగా ఉండే రోల్స్ కాదని.. క్యామియోలకు కాస్త ఎక్కువగా మాత్రమే ఉంటాయని తెలుస్తోంది.