ఫోటో స్టొరీ: వాటర్ స్ప్లాష్.. విండోస్ టాప్

Update: 2019-07-13 06:43 GMT
ఒక హీరోయిన్ పదిహేనేళ్ళుగా హీరోయిన్ గా కొనసాగడం అనేది ఈ జెనరేషన్ లో సాధారణమైన విషయం కాదు. అలాంటి కష్టమైన విషయాన్ని సులువుగా చేసి చూపించింది అందాల చందమామ కాజల్ అగర్వాల్.   ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ యుంగ్ జెనరేషన్ బ్యూటీలకు పోటీనిస్తోంది.  వీటన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే కాజల్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎంత నాజూగ్గా ఉందో ఇప్పుడు కూడా అంతే  నాజూగ్గా ఉంది.  ఇక సోషల్ మీడియాలో కాజల్ యాక్టివ్ గా ఉంటుంది. కాజల్ సోషల్ మీడియా ఖాతాలకు భారీగా ఫాలోయర్స్ కూడా ఉన్నారు.

అందుకే వారికోసం రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది.  తాజాగా వాటర్ థీమ్ తో ఒక ఫోటోషూట్ చేసింది కాజల్.  అంటే ఒక స్విమ్మింగ్ పూల్ లో నీటిని వెదజల్లుతూ చేసిన ఫోటో షూట్.  సహజంగా స్విమ్మింగ్ పూల్ అనగానే బికినీలు..మొనోకినీ.. ధరించి అందాలు వడ్డిస్తూ ఫోటోలు తీసుకుంటారు. కానీ ఇది ఆ టైపు కాదు.  సాధారణమైన దుస్తులు ధరించి పోజులిచ్చింది. వైట్ కలర్ టాప్..  అదే రంగులో ఉండే మిడ్డీ ధరించి చిరునవ్వులు రువ్వుతూ.. కాలితో నీటిని డిస్టర్బ్ చేస్తూ ఆ నీళ్ళు ఎగిరిపడుతుంటే కెమెరాకు పోజులిచ్చింది. కాజల్ ధరించిన వైట్ టాప్ కు విండోస్ ఉండడంతో గ్లామరస్ గా కనిపిస్తోంది.  ఈ ఫోటోకు "ఆక్వా ఫరెవర్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఈ ఫోటోకు "వావ్.. స్టన్నింగ్ పోజు".. "బ్యూటీ క్వీన్.. చాలా కూల్ గా ఉన్నావు".. "అమేజింగ్ ఫోటో షూట్" అంటూ కామెంట్లు పెట్టారు. ఒకరు మాత్రం "నువ్వు ఈ ఫోటో షూట్ ను బికినీతో చేసి ఉండాల్సింది" అంటూ నిట్టూర్చారు.  కాజల్ సినిమాల విషయానికి వస్తే తెలుగులో శర్వానంద్ 'రణరంగం' లో హీరోయిన్ గా నటిస్తోంది.  తమిళంలో 'కోమలి'.. 'ప్యారిస్ ప్యారిస్' సినిమాల్లో నటిస్తోంది.    


Tags:    

Similar News