టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'ఆచార్య' సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. మార్చిలో షూటింగ్ లో పాల్గొనాల్సి ఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా నుండి కాజల్ అగర్వాల్ తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. 'ఆచార్య' సినిమా కోసం కాజల్ ఇచ్చిన డేట్స్ లాక్ డౌన్ కారణంగా వృధా అయ్యాయని.. అదే సమయంలో తమిళ్ లో కాజల్ ఒక సినిమా చెయ్యాల్సి ఉండి అక్కడ అడ్వాన్స్ కూడా తీసుకుందని.. మెగాస్టార్ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో వేరే ఆప్షన్ లేక సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఏ ముహూర్తాన మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాను మొదలుపెట్టాడో కానీ.. ఈ సినిమాకు అడుగుడున గండాలు ఎదురువుతున్నాయని మెగా అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వాస్తవానికి ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి హీరోయిన్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మొదట ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా త్రిషను సెలెక్ట్ చేయగా ఆమె అనూహ్యంగా సినిమా నుంచి తప్పుకొని షాకిచ్చింది.
ఇప్పుడు తాజాగా కాజల్ అగర్వాల్ తప్పుకుందంటూ వార్తలు రావడంతో అందరూ కంగారుపడిపోయారు. అయితే తాజా సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ 'ఆచార్య' నుంచి తప్పుకుందనే వార్త నిజం కాదంట. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ అగర్వాల్ మేనేజర్ చెప్పుకొచ్చాడట. ఆయన మాట్లాడుతూ ఈ న్యూస్ రూమర్ మాత్రమే.. వేరే సినిమాకి ఇచ్చిన డేట్స్ వల్ల తప్పుకుంది అనేది అవాస్తవమని.. కాజల్ ఆ సినిమాలో నటించడానికి ఎంతో ఉత్సాహంగా ఉంది. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే షూటింగ్ లో పొల్గొనబోతోందని వివరణ ఇచ్చాడట. దీంతో కాజల్ పాప 'ఆచార్య'లో నటించట్లేదన్న రూమర్స్ కి బ్రేక్ పడినట్లే. ఇదిలా ఉండగా 'భరత్ అనే నేను' సినిమాన తర్వాత చాలా గ్యాప్ తీసుకొని కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ - కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించబోతున్నాడు. సామాజిక కోణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి లుక్ కూడా ఆసక్తిగొలిపేలా ఉంది. మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది.