కాజల్ ని పక్కన పెట్టేసారు!

Update: 2022-07-08 16:30 GMT
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌ సౌత్‌ తో పాటు బాలీవుడ్‌ లో కూడా పలు సినిమాల్లో నటించింది. పుష్కర కాలం పాటు టాలీవుడ్‌ లో టాప్‌ స్టార్‌ హీరోయిన్ గా సినిమాలు చేసింది. తమిళంలో కూడా దాదాపు అందరు స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకుంది. ఇండియన్ 2 లో కమల్‌ తో కూడా నటించే అవకాశంను దక్కించుకున్న విషయం తెల్సిందే.

శంకర్ దర్శకత్వంలో అది కూడా యూనివర్శిల్ స్టార్‌ కమల్‌ హాసన్ కు జోడీగా నటించే అవకాశం రావడంతో కాజల్ ఎగిరి గంతేసినంత పని చేసింది. షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యింది. కొన్నాళ్ల పాటు షూటింగ్ లో కూడా పాల్గొన్న ఈ అమ్మడికి షాక్ అన్నట్లుగా సినిమా ఆగిపోయింది. వరుసగా ఏదో ఒక అవాంతరం రావడంతో సినిమా మొత్తానికి నిలిచి పోయింది.

ఆమధ్య నిర్మాతలకు మరియు దర్శకుడు శంకర్‌ కు మధ్య చర్చలు జరిగాయి. కమల్‌ హాసన్‌ ఇండియన్ 2 ను పూర్తి చేస్తాడనే వార్తలు వచ్చాయి. కానీ అసలు విషయం ఏంటీ అనేది ఇంకా క్లారిటీ రాలేదు. మరో వైపు విక్రమ్‌ సినిమా సక్సెస్ జోష్ మీద ఉన్న కమల్‌ హాసన్ వెంటనే ఇండియన్ 2 ను కూడా మొదలు పెట్టి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఉబలాట పడుతున్నాడనే వార్తలు వస్తున్నాయి.

కమల్‌ హాసన్‌ ఈ సినిమాను కొత్త నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులతో మళ్లీ మొదలు పెట్టే విషయమై ఆలోచన చేస్తున్నాడట. స్క్రిప్ట్‌ విషయంలో మార్పులు చేర్పులు ఏమీ లేకుండానే ఇండియన్‌ 2 ను  చేయబోతున్నాడట. ఇప్పటికే షూట్ చేసిన కొంత మొత్తం ను అలాగే ఉంచే అవకాశాలు కూడా ఉన్నాయి.

కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుతం షూటింగ్ లకు వచ్చే అవకాశం ఉందా లేదా అనే విషయం లో క్లారిటీ లేదు. కాని ఆమె పాత్రను పూర్తిగా తొలగించి మరో హీరోయిన్‌ తో ఈ సినిమాలో హీరోయిన్‌ గా నటింపజేసే విధంగా  చర్చలు జరుపుతున్నారట. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ తో లోకనాయకుడి టీమ్‌ చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.

మొత్తానికి యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ ఇండియన్ 2 సినిమాను చేయబోతున్న నేపథ్యంలో సినీ ప్రేమికులు మరియు ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాజల్‌ ఈ సినిమా కూడా మిస్‌ చేసుకోవడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతుకు ముందు నాగార్జున ఘోస్ట్‌ సినిమా నుండి కూడా కాజల్ ఔట్ అయిన విషయం తెల్సిందే.
Tags:    

Similar News