మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ఆచార్య'. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని అన్నీ అనుకున్నట్లు జరిగితే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు హీరోయిన్ కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఈ సినిమా హీరోయిన్ గా మొదట్లో త్రిష ను అనుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవికి ఊహించని షాక్ ఇచ్చింది ఈ సీనియర్ హీరోయిన్ త్రిష. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం నుంచి తప్పుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించింది. అక్కడితో ఆగకుండా ట్విట్టర్ ద్వారా క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే సినిమా నుండి తప్పుకుంటున్నా అని ప్రకటించింది. మెగాస్టార్ సినిమాలో ఒక్క ఫ్రేమ్‌లో కనిపించినా చాలని సంబర పడుతుంటారు, అలాంటిది త్రిష చేసిన పనికి ఇండస్ట్రీలో రకరకాలుగా మాట్లాడుకున్నారు.
ఇప్పుడు ఆమె స్థానంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారు. ఈ మధ్య కాజల్ కు పెద్దగా సినిమాలు లేవు. చిన్న హీరోల సరసన కూడా నటిస్తూ 70 నుండి 80 లక్షల దాకా పారితోషకం తీసుకుంటోంది. అయితే మెగాస్టార్ సినిమా చేసేందుకు మాత్రం రెండున్నర కోట్లు భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిందట. ఫైనల్ గా కోటిన్నరకు ఒప్పుకుందని సమాచారం. చిరంజీవితో కాజల్ కు ఇది రెండో సినిమా. ఇంతకముందు వీరి కలయికలో వచ్చిన ఖైదీ 150 చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సెంటిమెంటుగా ఈ చిత్రం కూడా ఘన విజయం సాధిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమను ఏలిన మెగాస్టార్ కే హీరోయిన్ కష్టాలు తప్పడం లేదని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.