ఒకే స్టార్ నటించిన రెండు సినిమాలు ఒకే తేదీకి రిలీజవ్వడం అరుదైన విషయమే. తెలుగుతో పాటు తమిళంలోనూ కెరీర్ పరంగా బిజీగా ఉన్న స్టార్లకు ఇలాంటి రేర్ మూవ్ మెంట్ ఎదురవుతుంది. అందాల సమంత నటించిన తెలుగు - తమిళ చిత్రాలు ఒకే రిలీజ్ తేదీకి వచ్చి తనకు పేరు తెచ్చిన సందర్భాలున్నాయి. ఇటీవలే సూపర్ డీలక్స్ (తమిళ్) - యూటర్న్ (తెలుగు) చిత్రాలు అలానే రిలీజయ్యాయి. ఇవి రెండూ సమంతకు నటిగా మంచి మార్కులే వేయించాయి. ఒకే సారి రిలీజ్ కావడంతో ప్రమోషన్స్ కోసం సామ్ చాలానే టెన్షన్ పడింది.
ఈసారి ఆ తరహా సన్నివేశం చందమామ కాజల్ కు ఎదురైంది.. ఒకటి తెలుగు రిలీజ్.. వేరొకటి తమిళంలో రిలీజ్.. దీంతో కాజల్ ప్రచార హడావుడితో ఉక్కిరి బిక్కిరి అయ్యే సన్నివేశం నెలకొందట. కాజల్ నటించిన తెలుగు చిత్రం `రణరంగం` .. తమిళ చిత్రం `కోమలి` ఆగస్టు 15న రిలీజవుతున్నాయి. రణరంగం .. కోమలి రెండు చిత్రాల్లో కాజల్ ఇంట్రెస్టింగ్ పాత్రల్ని పోషిస్తోందట. ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ కి కాజల్ రెడీ అవుతోంది.
శర్వా సరసన `రణరంగం`లో కాజల్ డీసెంట్ పెర్ఫామెన్స్ తో మెప్పించేందుకు స్కోప్ ఉందట. గ్యాంగ్ స్టర్ అయిన కథానాయకుడి లైఫ్ లో 1990 మరియు 2000 సంవత్సరాలలో జరిగిన సంఘటనల సమాహారంగా ఈ సినిమా కథనం రక్తి కట్టించనుంది. నాయకానాయికలకు భిన్నమైన భావోద్వేగాల్ని పలికించేందుకు స్కోప్ ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో కాజల్ తో పాటుగా కళ్యాణి ప్రియదర్శన్ వేరొక కథానాయికగా ఆడిపాడుతోంది. తమిళ చిత్రం కోమలి లో జయం రవి కథానాయకుడు. ప్రదీప్ రంగరాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోనూ జయం రవి ఆసక్తికరమైన పాత్రలో కనిపించనుండగా అతడి సరసన కాజల్ ఉద్వేగాలు పలికించే పాత్రలో కనిపించబోతోందట. రకరకాల జనరేషన్స్ లుక్ తో జయం రవి పోస్టర్లు ఇప్పటికే తమిళ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. అందుకే కాజల్ పాత్రకు నటనకు స్కోప్ ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. ఒకేసారి ఈ రెండు సినిమాలు విజయాలు సాధిస్తే కాజల్ పేరు మార్మోగుతుందనడంలో సందేహమేం లేదు.