శారీరక సౌందర్య అందరికీ ఉండొచ్చు.. కానీ మానసిక సౌందర్యం కొంత మందికే ఉంటుంది. అయితే.. ఇవి రెండూ కలగలిసిన బ్యూటీఫుల్ చందమామ మన కాజల్. కష్టాల్లో ఉన్నామంటూ అడిగిన వారికి పలుమార్లు సహాయంచేసిన కాజల్.. ఇప్పుడు తన అభిమానికి అండగా నిలిచింది.
సుమ అనే ఓ అమ్మాయి తన అవసరాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. దయామయులు తనకు అండగా నిలిచి, ఆదుకోవాలని అభ్యర్థించింది. ఇప్పుడు తాను ఎం.ఫార్మసీ చదువుతున్నానని, ఉద్యోగం చేస్తూ చదువుకుంటుండగా.. ఈ మధ్యనే తన జాబ్ పోయిందని తెలిపింది.
తన పరీక్ష ఫీజుకు రూ.83,000 కావాల్సి ఉందని, దాతలు ఎవరైనా ఆదుకోవాలని కోరింది. ఈ విషయం తెలుసుకున్న కాజల్.. వెంటనే ఆ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కోవాలని తన టీమ్ ను కోరింది. వెంటనే కాజల్ టీమ్.. సుమ వివరాలు కలెక్ట్ చేసింది. వారి పరిశీలనలో ఆ అమ్మాయి అవసరం నిజమేనని తేలింది.
దీంతో.. వెంటనే ఆ డబ్బు సమకూర్చింది చందమామ కాజల్. ఆ అమ్మాయికి 83 వేలు అవసరం ఉండగా.. లక్ష రూపాయలను పంపించింది. గూగుల్ పే యాప్ ద్వారా తన ఫోన్ నుంచే సుమ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేసింది.
ఈ విషయం సోషల్ మీడియాకు తెలియడంతో.. అందరూ కాజల్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ సహాయాన్ని కేవలం డబ్బులతో కొలవలేమని, అమ్మాయి చదువుకు అండగా నిలవడం ద్వారా.. ఆమె జీవితాన్ని నిలబెట్టిందని అంటున్నారు. నిజంగా కాజల్ ది చందమామ లాంటి చల్లటి మనసు అని మెచ్చుకుంటున్నారు.