బాలీవుడ్ బ్యూటీ కాజోల్.. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. చిన్న గ్యాప్ తీసుకుని దిల్ వాలే అంటూ షారూక్ ఖాన్ తో బాగానే సందడి చేసింది. ఆశించిన స్థాయి విజయం సాధించకపోయినా.. ఈ మూవీతో తనలోని గ్లామర్ యాంగల్ కానీ.. యాక్టింగ్ ట్యాలెంట్ కానీ ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకుంది.
రెండు దశాబ్దాల తర్వాత అంటే మెరుపుకలలు మూవీ తర్వాత మళ్లీ సౌత్ మూవీ చేసేందుకు ఒప్పుకున్న ఈ బాలీవుడ్ భామ.. ధనుష్ మూవీ వీఐపీ2 లో నటిస్తోంది. వేలఇళ్లపట్టాదారి కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ మూవీలో.. కాజోల్ ఓ బిజినెస్ మ్యాగ్నెట్ గా నటస్తుండగా.. ఈమె రోల్ నెగిటివ్ షేడ్స్ ఉండేది కావడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి కాజోల్ వెర్షన్ కు సంబంధించిన మొత్తం పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్లు తెలుస్తోంది. అమలాపాల్ ఈ సినిమాలో లీడ్ హీరోయిన్ పాత్రను పోషిస్తోంది.
ధనుష్ ఈ చిత్రానికి కథ.. డైలాగ్స్ అందించగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిందని తెలుస్తోంది. తెలుగులో రఘువరన్ బీటెక్2 అనే టైటిల్ పై రిలీజ్ అయ్యే అవకాశం ఉన్న ఈ చిత్రానికి ధనుష్ సహ నిర్మాత కాగా.. ధనుష్ భార్య సోదరి సౌందర్యా రజినీకాంత్ దర్శకత్వంలో ఈ మవీ రూపొందుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/