రౌడీ స్టార్ కోసం బిగ్ బి?

భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో ఓ కీలక పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ ని తీసుకుంటున్నారని టాక్.

Update: 2025-01-26 06:28 GMT

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ గతకొంతకాలంగా సౌత్ సినిమాలలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 'కల్కి 2898ఏడీ'లో అమితాబ్ బచ్చన్ చేసిన అశ్వద్ధామ క్యారెక్టర్ ఎన్ని ప్రశంసలు లభించాయో అందరికి తెలిసిందే. 'కల్కి'లో ప్రభాస్ క్యారెక్టర్ కంటే అమితాబ్ పాత్ర చాలా బలంగా ఉంటుంది. అలాగే గతంలో మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో అమితాబ్ బచ్చన్ నటించారు.

గత ఏడాది తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ 'వేట్టయాన్' చిత్రంలో హ్యూమన్ రైట్స్ లాయర్ గా పవర్ ఫుల్ రోల్ లో బిగ్ బి కనిపించి మెప్పించారు. ఆయన ఇమేజ్ కి సరిపోయే క్యారెక్టర్స్ ఉంటే దర్శకులు కూడా అమితాబ్ బచ్చన్ ని తమ సినిమాలలో తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బి తెలుగులో మరో పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నారని ప్రచారం నడుస్తోంది.

రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఒక పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో 1854-78 మధ్యకాలంలో నడిచే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకి జోడీగా రష్మిక మందన కన్ఫర్మ్ అయ్యింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో ఓ కీలక పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ ని తీసుకుంటున్నారని టాక్.

ఫిబ్రవరి నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. చాలా పవర్ ఫుల్ కథాంశంతో ఈ చిత్రం ఉండబోతోందంట. అలాగే విజయ్ దేవరకొండ కూడా ఈ మూవీలో భిన్నమైన లుక్ లో కనిపిస్తాడనే మాట వినిపిస్తోంది. ఇక ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్ తోనే స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్టర్ 'ది మమ్మీ' ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ నటించబోతున్నాడని మాట వినిపిస్తోంది.

ఇందులో వాస్తవం ఎంత అనేది క్లారిటీ లేదు. హాలీవుడ్ యాక్టర్ ఈ చిత్రంలో నటిస్తే మాత్రం కచ్చితంగా సినిమాపైన భారీ హైప్ క్రియేట్ అవుతుంది. అలాగే అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో కనిపిస్తే హిందీ మార్కెట్ లో కచ్చితంగా సినిమాకి మంచి క్రేజ్ లభిస్తుంది. సోషల్ మీడియాలో విస్తృతంగా నడుస్తోన్న ఈ ప్రచారాలలో వాస్తవాలు ఏంటనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే. 'శ్యామ్ సింగరాయ్' లాంటి సక్సెస్ తర్వాత రాహుల్ సాంకృత్యాన్ లాంగ్ గ్యాప్ తీసుకొని విజయ్ దేవరకొండతో మూవీ చేస్తున్నారు.

Tags:    

Similar News