మీటింగులకు రాలేదు.. హీరోయిన్ పై వేటు?

Update: 2017-05-18 16:04 GMT
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రసార భారతిలో బోర్డు సభ్యురాలిగా పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఆమె సంస్థ కీలక సమావేశాలకు హాజరు కాకపోవడంతో ఆ పదవి నుంచి తప్పించేందుకు ప్రసార భారతి రంగం సిద్ధం చేసింది. 2016 ఫిబ్రవరిలో కాజోల్‌ ను ప్రసార భారతి బోర్డులో పార్ట్ టైం సభ్యురాలిగా నియమించారు. ఈ పదవిపై కాజోల్ అప్పట్లో చాలా సంతోషం వ్యక్తం చేసింది. ఐతే మొదట్లో బోర్డు సమావేశాలపై ఆసక్తి చూపించిన కాజోల్.. గత కొంత కాలంగా డుమ్మా కొడుతోంది. గత నాలుగు సమావేశాల్లోనూ ఆమె పాల్గొనలేదు. దీంతో ఆమెను పదవి నుంచి తప్పించాలని భావిస్తున్నారు.

ప్రసార భారతి చైర్మన్‌ కు చెప్పకుండా ఏ సభ్యులైనా వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరైతే వాళ్ల సభ్యత్వాన్ని రద్దుచేయచ్చని నిబంధన ఉంది. దీని ప్రకారమే కాజల్ ను తప్పించాలని చూస్తున్నారు. ఐతే వృత్తిపరమైన సపనుల వల్లే గత మూడు నాలుగు సమావేశాలకు కాజోల్ హాజరు కాలేదని ఆమె ప్రతినిధి జైవీర్ అంటున్నాడు. గత ఏడాది కాలంలో కుటుంబ పరమైన వైద్య కారణాలు కూడా కాజల్ రాకపోవడానికి కారణాలయ్యాయని.. సమావేశాలకు గైర్హాజరు కావడంపై కాజోల్ బాధపడ్డారని చెప్పాడు. ఐతే ముందు కాజోల్ కు నోటీసు ఇచ్చి.. ఆమె సభ్యత్వ రద్దుపై ఏం చేయాలో సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు వదిలేస్తామని అధికారులు అంటున్నారు. ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే ప్రసార భారతి నడుస్తుంది. పరిశీలనలో ఉంది. దూరదర్శన్, ఆలిండియా రేడియోలతో కూడిన ప్రసారభారతి ఒక స్వతంత్ర సంస్థ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News